కోదాడ,ఆగష్టు 26(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మండల పరిధిలోని గుడిబండ రైతు వేదిక నందు ఒకే రోజు కోటి మొక్కలు నాటే కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన ఎంపీపీ చింతా కవితా రాదారెడ్డి.ఈ సందర్భంగా ఎంపీపీ చింతా కవితా రాదారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కోటి వృక్షార్చన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో పాటు ఉద్యమంలా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విరివిగా అడవులు పెంచి ఆకుపచ్చ తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా అడుగులు వేస్తుందని అధినేత సీఎం కేసీఆర్ గారి దార్శనికతతో అడవులు పెంచి హరిత తెలంగాణ సాదిస్తున్నారని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత కలిగి మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని లక్ష్య సాధనకు కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయ శ్రీ, ఏపిఓ తానియా,పంచాయతీ కార్యదర్శి ఫాతిమా,వార్డు సభ్యులు ఆత్కూరి శేషు,సురేష్,మండల మహిళాధ్యక్షురాలు నర్సింగోజు గీత,గ్రామశాఖ అధ్యక్షులు మహమ్మద్ సలీం,వాచేపల్లి వెంకటేశ్వర్లు,నాగయ్య,ఊదర బాబు,గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన ఎంపీపీ చింతా కవితా రాదారెడ్డి.
RELATED ARTICLES



