కోదాడ,సెప్టెంబర్ 12(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగ టిపిసిసి సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి మరియు నల్లగొండ పార్లమెంట్ సోషల్ మీడియా ఇంచార్జ్ అక్కిరాజు రజనీకాంత్ జన్మదిన వేడుకను కోదాడ పట్టణంలోని వారి నివాసంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి రజనీకాంత్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రజనీకాంత్ పార్టీలో ఎంతో వినయతతో నిబద్దతతో పనిచేస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అన్నారు.ఇట్టి కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు వంటిపులి వెంకటేష్,ఆవుదొడ్డి ధన మూర్తి,పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వంగవేటి రామారావు,కాంగ్రెస్ సీనియర్ నాయకులు చల్లా కొండల్ రెడ్డి,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కోటేశ్వరరావు,డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గంధం యాదగిరి,బసవయ్య,బాగ్దాద్,శేఖర్ రెడ్డి, ఖశిం భాయ్ ,ధావల్,ముస్తఫా,ఆలేటి రాంబాబు,కంబాల ప్రసాద్,శోభన్ తదితరులు పాల్గొన్నారు.



