వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్యను సన్మానించిన షేక్ రఫీ
కోదాడ,జులై 10(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ముత్తినేని వీరయ్య వర్మను ముస్లిం సంప్రదాయం ప్రకారం సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం రాష్ట్ర నాయకులు షేక్ రఫీ.అనంతరం రఫీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ గా ముత్తినేని వీరయ్య వర్మ నియమించటం పట్ల వికలాంగుల సమాజం ఎంతో హర్షం వ్యక్తం చేస్తుందని నిత్యం వికలాంగుల జాతి హక్కుల కోసం కెసిఆర్ ప్రభుత్వం పై అలుపెరగని పోరాటం చేసిన ఫలితంగానే ముత్తినేని వీరయ్య వర్మకు చైర్మన్ పదవి దక్కిందని కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన ప్రతి నాయకుడికి గుర్తింపు ఉంటుంది అనడానికి వీరయ్య చైర్మన్ గా ఎన్నిక కావటమే ఓ నిదర్శనమని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
Pls subscribe https://youtu.be/4AMb6_qCk9Y?si=CYTt36eXelcT9cQq