పాలకుర్తి మండలం లో లారీ-బస్సు ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం
Mbmtelugunews//జనగామ జిల్లా,సెప్టెంబర్ 03:పాలకుర్తి మండలం,వావిలాల దగ్గర బస్సు,లారీ ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో
ముగ్గురికి చేరిన మృతుల సంఖ్య.వెలికట్ట గ్రామ శివారు టికె తండాకు చెందిన భార్యాభర్తలు జాటో హేమానీ,బుజ్జమ్మ ఇద్దరు దంపతులు.పాలకుర్తి మండలానికి చెందిన ఎండి నసీమ మృతి.హేమాని బుజ్జమ్మ దంపతులు హైదరాబాదులోని కొడుకు ఇంటికి వెళ్ళి స్వగ్రామానికి వస్తుండగా జరిగిన ప్రమాదం.వావిలాల ప్రమాదంలో మృతి చెందడంతో తండాలో విషాదం నెలకొని ఉంది.సంఘటన స్థలాన్ని సందర్శించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి,ఇన్చార్జి ఝాన్సి రెడ్డి.క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.



