ఇంపాక్ట్ ట్రైనర్గా సర్టిఫికెట్ ఆఫ్ ది బెస్ట్ ఫర్ ఫార్మర్ అవార్డు అందుకున్న శ్రీమతి రెహనా షేర్ అలీ
Mbmtelugunews//కోదాడ,సెప్టెంబర్ 25(ప్రతినిధి మాతంగి సురేష్):ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫౌండర్ మోటివేటర్ గంపా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో 30 రోజులు ఆన్లైన్లో జరిగి ఆఫ్లైన్ హైదరాబాదులో మినర్వా గ్రాండ్ హోటల్ లో రెండు రోజులు మోటివేషనల్ స్పీకర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరిగింది.ఈ ప్రోగ్రాంలో బెస్ట్ మోటివేషన్ స్పీకర్ టి టి డబ్ల్యూ ఎస్ 170 బ్యాచ్ లో 60 మంది వివిధ జిల్లాల నుండి పాల్గొనగా సూర్యాపేట జిల్లా కోదాడ నుండి రెహనా బేగం ఎన్నిక కావడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఇంపాక్ట్ స్ఫూర్తి ఫౌండేషన్ అధినేత శ్యామ్ రాథోడ్,మెంటర్స్ వెంకటేష్,ప్రసాద్,పర్వీన్,హైమా,లక్ష్మీదేవి ప్రముఖ టైనర్స్ చేతుల మీదుగా సర్టిఫికెట్ అండ్ అవార్డు తీసుకున్నారు.