*రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హన్మాజిపేట గ్రామం లో రోడ్డు ప్రమాదం*
*ప్రాణం తీసిన అతివేగం.. చెట్టును బైకు ఢీకొని ఇద్దరు యువకుల దుర్మరణం*
*రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేటలో గ్రామం లో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు*
Mbmtelugunews//వేములవాడ,అక్టోబర్ 14:రాజన్న సిరిసిల్ల జిల్లా ద్విచక్ర వాహనం చెట్టును బలంగా ఢీకొనడంతో ఇద్దరి యువకులు దుర్మరణం చెందిన విషాద సంఘటన వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన విక్కుర్తి దిలీప్ (22) సురా అనిల్ (21) అనే ఇద్దరు స్నేహితులు గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన దుర్గామాత నిమజ్జన వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అప్పటివరకు ఎంతో సంతోషంగా వున్న ఇద్దరు మిత్రులు దుర్గామాత నిమజ్జనం తర్వాత నూతనంగా కొనుగోలు చేసిన బైకుపై సరదాగా మామిడిపల్లి రహదారి వైపు వెళ్లారు.అతివేగంతో బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొనడంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.వైద్యులు పరీక్షించి పరిస్థితి విషమంగా ఉందని తెలపడంతో మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం పెద్ద ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మార్గమధ్యలో ఇద్దరు యువకులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు.మృతదేహాలను సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రుల రోదనలతో హన్మాజీపేట గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.



