Saturday, April 4, 2026
[t4b-ticker]

వేముల మహేందర్ గౌడ్ రూపొందించిన క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొండా సురేఖమ్మ

వేముల మహేందర్ గౌడ్ రూపొందించిన క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొండా సురేఖమ్మ

Mbmtelugunews//జయశంకర్ భూపాలపల్లి,జనవరి 12 (ప్రతినిధి మాతంగి సురేష్):కొండా దంపతుల వీరాభిమాని..బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ రూపొందించిన 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆదివారం హన్మకొండ జిల్లా రాంనగర్ లో గల మంత్రి నివాసంలో రాష్ట్ర అటవీ,పర్యావరణ,దేవాదాయ,ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖమ్మ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వేముల మహేందర్ గౌడ్ రూపొందించిన 2025 నూతన సంవత్సర క్యాలెండర్ అట్లా ఆమె హర్షం వ్యక్తం చేశారు.అనంతరం మంత్రి సురేఖమ్మ మాట్లాడారు ఈ నూతన సంవత్సరం ప్రజలంతా అష్టైశ్వర్యాలతో,సుఖ సంతోషాలతో,పాడి పంటలతో,పిల్లాపాపలతో,క్షేమంగా నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ హన్మకొండ జిల్లా నాయకులు బొల్లం శివ,జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మాజీ సర్పంచ్ సదానందం,కాంగ్రెస్ నాయకులు పుల్యాల గాంధీ తదితరులు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular