దేశ చరిత్రలో సువర్ణ అధ్యాయానికి నాంది పలుకుతున్న హుజూర్ నగర్
:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలి.
:హలో కాంగ్రెస్ చలో హుజూర్ నగర్.
:మాజీ జిల్లా పరిషత్ సాంఘిక సంక్షేమ స్థాయి సంఘాల ఛైర్ పర్సన్ బాణాల కవిత నాగరాజు
Mbmtelugunews//కోదాడ,మార్చి 29(ప్రతినిధి మాతంగి సురేష్):నడిగూడెం మండలం కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు నమస్కారం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పేదలకు సన్న బియ్యం పంపిణి కార్యక్రమం రేపు అనగా 30-03-2025 ఆదివారం సాయంత్రం 5గంటలకు హుజుర్ నగర్ పట్టణంలో రాజీవ్ ప్రాంగణంలో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించి అనంతరం బహిరంగ సభ ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఇట్టి కార్యక్రమనికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి,మన ప్రియతమ నాయకులు నీటిపారుదల,పౌర సరఫరాల శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి,రాష్ట్ర మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలు వివిధ హోదాలో ఉన్న నాయకులు పాల్గొంటారు.కావున మన నడిగూడెం మండలంలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు,కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,అభిమానులు ప్రతి గ్రామం నుండి అధిక సంఖ్యలో అందరూ సకాలంలో విచ్చేసి ఇట్టి కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని మాజీ జిల్లా పరిషత్ సాంఘిక సంక్షేమ స్థాయి సంఘాల ఛైర్ పర్సన్ బాణాల కవిత నాగరాజు కోరుకుంటూన్నారు.