బహిరంగ చర్చలకు మేము సిద్ధం… మీరు సిద్ధమా
:టైము….. ప్లేస్…. డిసైడ్ మీదే.
:అవినీతికి కేరాఫ్ గా పని చేసింది మీరే…..
:మీ అవినీతి నీ తట్టుకోలేకే పద్మావతి ఉత్తమ్ ను గెలిపించారు..
Mbmtelugunews//కోదాడ, నవంబర్ 02(ప్రతినిధి మాతంగి సురేష్): మొన్ననే నీ చుట్టూ ఉన్నవారు సీఎం సహాయ నిధి నొక్కింది బయటపడలేదా!ఉత్తమ్, పద్మావతి లను విమర్శిస్తే సూర్యుని మీద ఉమ్మి వేసినట్లే.విమర్శలు మాని అభివృద్ధికి సహకరించండి, నిజాయితీకి నిలువెత్తు సాక్ష్యం మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి లేనని నిజాయితీతో పరిపాలన చేస్తున్న మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి లను విమర్శించే స్థాయి కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కు లేదని కోదాడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోదాడ మాజీ సర్పంచ్ ఎర్నేని బాబు అన్నారు. ఆదివారం తన నివాసంలో మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి లపై మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చేసిన నిరాధార అసత్య ఆరోపణలను ఖండిస్తూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేగా ఉండే ఐదు సంవత్సరాల పాటు నియోజకవర్గంలో ల్యాండు, సాండ్, లిక్కర్ దందా లపై కమిషన్లు బహిరంగంగా తీసుకున్నది ఎవరో కోదాడ ప్రజలందరికీ తెలుసు అన్నారు. కోదాడ నియోజకవర్గంలో జరిగిన అవినీతిపై అభివృద్ధిపై తాము చర్చలకు సిద్ధమేనని టైం ప్లేస్ డిసైడ్ చేసుకోవచ్చని సవాలు విసిరారు. కోదాడ నియోజకవర్గంలో కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తూ ఎత్తిపోతల పథకాలకు, రోడ్లకు, ప్రభుత్వ భవనాల నిర్మాణానికి, ప్రభుత్వ వైద్యశాల, ఆర్టీసీ బస్టాండ్ ను అభివృద్ధి చేస్తున్న విషయం కనిపించడం లేదా అన్నారు. జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక నిరాధారణమైన అసత్య ఆరోపణలను మానుకోవాలని హితవు పలికారు ఇటీవలే మీ చుట్టూ ఉన్నవారు సీఎం సహాయ నిధి కాజేసిన వ్యవహారం బయటపడలేదా అని ఘాటుగా విమర్శించారు. అవినీతి పై మాట్లాడుతున్న మీరు దొంగే దొంగ అన్న చందంగా ఉందని ఎద్దేవ చేశారు. కోదాడ నియోజకవర్గంలో ప్రజలు ఉత్తం పద్మావతి పాలనలో ఎవరి పనులు వారు చేసుకుంటూ స్వేచ్ఛగా ఉన్నారన్నారు. మీ పాలనలో విసిగిన జనం ఉత్తమ్ పద్మావతిని భారీ మెజార్టీతో గెలిపించారన్నారు. విమర్శలు మాని జరుగుతున్న అభివృద్ధికి సహకరించాలని కోరారు ఈ సమావేశంలో ఎర్రవరం పిఎసిఎస్ చైర్మన్ నలజాల శ్రీనివాసరావు, పారా వెంకటేశ్వర్లు, నెమ్మది దేవమని, వంగవీటి శ్రీనివాసరావు, కర్రీ సుబ్బారావు, ఎండి ఖాజా మొయినిద్దీన్, రావెళ్ళ కృష్ణారావు, వంటిపులి శ్రీనివాస్, మల్లు వెంకటరెడ్డి, మల్లు నాగిరెడ్డి, వెంకటేశ్వరరావు, మేకపోతుల సత్యనారాయణ, కందరపోయిన పెద్ద వేలాద్రి, బొలిశెట్టి రాము, చిత్తులూరి భీమయ్య, మైలారంశెట్టి భాస్కర్, షేక్ ఇక్బాల్, లైటింగ్ ప్రసాద్, వెంకటేశ్వరరావు, అవిరే వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.



