డిప్యూటీ సీఎం భట్టి కుమారుడి ఎంగేజ్‌మెంట్.. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
Mbmtelugunews//హైదరాబాద్, నవంబర్ 27(ప్రతినిధి మాతంగి సురేష్): తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య ఎంగేజ్‌మెంట్ వేడుక హైదరాబాద్ లోని ప్రజా భవన్ లో ఘనంగా జరిగింది.
ఈ వేడుకకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు.
సతీమణి, కూతురు, అల్లుడితో కలిసి వచ్చిన సీఎం.. కాబోయే వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు చెప్పారు.
పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు, ముఖ్య నేతలు, అధికారులు ఈ వేడుకకు హాజరయ్యారు.



