ఎన్నికల కమిషన్… ఓటుకు నోటును అరికట్ట లేదా?
Mbmtelugunews//కోదాడ, నవంబర్ 30(ప్రతినిధి మాతంగి సురేష్): నేడు ఎన్నికలు అనగానే ప్రధానంగా కనిపించే అంశం డబ్బు. దీన్ని వార్డు స్థాయి నుంచి ఎంపీ ఎలక్షన్ వరకు ఓటర్ కు డబ్బు ఎర్రగా చూపి పదవిని దక్కించుకుంటున్నారు. ఎన్నికల ప్రచారం చేస్తూ ఆ నాలుగు రోజులు మందులు విందులు ఆర్భాటాలు, అమలు చేయలేని వాగ్దానాలు పరిపాటిగా మారాయి. ప్రచారం సమప్తవాగానే ఇక డబ్బులు పంచే కార్యక్రమం దీన్ని ఎలక్షన్ కమిషన్ ఎందుకు పూర్తిస్థాయిలో నిఘాలతో గుర్తించి పట్టుబడ్డ డబ్బును మాత్రమే కాకుండా, డబ్బు పంచె అభ్యర్థుల్ని వారు డబ్బు పంచారు అన్న విషయం తెలిసినా కూడా వారిని అనర్హులుగా తక్షణం ప్రకటించే చర్యలు ఎందుకు చేపట్టలేక పోతుంది ? ఓటు హక్కు కై రాజ్యాంగం అందించిన అంబేద్కర్ స్ఫూర్తి ఇదేనా? ఇప్పటికైనా కొత్త మార్గదర్శకాలని బందోబస్తు టీమ్లను, నియమించి డబ్బు పంచె అభ్యర్థులపై వేటు వేసే విధంగా కమిషన్ చర్యలు తీసుకోవాలని సామాజిక ఉద్యమకర్త సయ్యద్ బషీరుద్దీన్ అన్నారు.



