Sunday, February 8, 2026
[t4b-ticker]

వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ల పై రైతులకు అవగాహన కల్పించాలి: ఏడి టిఆర్ఇ ఇందిరా రెడ్డి

వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ల పై రైతులకు అవగాహన కల్పించాలి: ఏడి టిఆర్ఇ ఇందిరా రెడ్డి

Mbmtelugunews//కోదాడ, జనవరి 07(ప్రతినిధి మాతంగి సురేష్): వ్యవసాయ పంటలకు వినియోగించుకునే ట్రాన్స్ఫార్మర్లకు ఏవైనా సమస్యలు వచ్చినట్లయితే వాటిని ఎలా అధిగమించాలో రైతులకు అవగాహన కల్పించాలని ఎలక్ట్రికల్ ఏడి టిఆర్ఈ సూర్యాపేట ఇందిరా రెడ్డి అన్నారు. బుధవారం కోదాడ సబ్ స్టేషన్ లో గల ట్రాన్స్ఫార్మర్స్ షెడ్డును పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రైతుల ట్రాన్స్ఫార్మర్లులకు ఏవైనా సమస్యలు వచ్చిన, కాలిపోయిన సంబంధిత ఏఈలు రైతులకు ఇబ్బంది కలగకుండా వారి వద్ద ఎలాంటి లావాదేవీలు తీసుకోకుండా వారి ట్రాన్స్ఫార్మర్లు రిపేర్ చేయించి వాటిని ఫిట్ చేసి రైతులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అన్నారు.

రైతులు వారి వాహనాలలో ట్రాన్స్ఫార్మర్ తీసుకువస్తే ట్రాన్స్ పోర్ట్ చార్జీలు ఎలా తీసుకోవాలో వారికి అవగాహన కల్పించాలని అన్నారు. రైతులు ట్రాన్స్ఫార్మర్ షెడ్ కి ట్రాన్స్ఫార్మర్లు తీసుకువచ్చినప్పుడు వారికి కాగితాల పేరుతో ఇబ్బందులు కలిగించొద్దని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఈ పార్వతి, చిలుకూరు ఏఈ, మేళ్లచెరువు ఏఈ, ట్రాన్స్ఫార్మర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular