Saturday, June 20, 2026
[t4b-ticker]

నాడు దేశ సేవ లో ఖ్యాతి గాంచిన సైనికుడు ఉత్తమ్..

నాడు దేశ సేవ లో ఖ్యాతి గాంచిన సైనికుడు ఉత్తమ్..

:నేడు ప్రజా సేవ లో అలుపెరుగని ఉత్తమ్….

:కోదాడ, హుజూర్ నగర్ నియోజక వర్గాల ప్రగతి భాగ్య విధాత ఉత్తమ్…

:ప్రజాసేవ శ్వాస గా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మంత్రి ఉత్తమ్…..

:అభివృద్దే ఆయన ఆశయం.. జనం మాటే ఆయన బాట…

:రైతుల పాలిట బాంధవుడు, ప్రాజెక్టుల అపర భగీరధుడు మంత్రి ఉత్తమ్…

:మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు..

Mbmtelugunews//కోదాడ, జూన్ 20(ప్రతినిధి మాతంగి సురేష్): కోదాడ హుజూర్నగర్ నియోజక వర్గాల ప్రగతి భాగ్య విధాత ఉత్తమ్ అని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు అన్నారు. శనివారం ఎర్నేని నివాసం వద్ద రాష్ట్ర భారీ నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ జన్మదిన వేడుకలు వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానుల మధ్య నిర్వహించి మాట్లాడారు. నాడు దేశ సేవ లో ఖ్యాతి గాంచిన సైనికుడు ఉత్తమ్
నేడు ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చి జీవితాన్ని ప్రజల కు త్యాగం చేస్తున్నారన్నారని అన్నారు. మంత్రి వర్గం లో కీలక శాఖలు చేపట్టి రాష్ట్రం లో అభివృద్ధి నీ పరుగులు పెట్టిస్తు ప్రభుత్వం లో కీలకంగా మారిన అగ్రనేత ఉత్తమ్ అన్నారు. భారీ నీటి పారుదల శాఖ మంత్రి గా రైతుల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సాగునీరుకు ఇబ్బందులు కలుగకుండా ప్రాజెక్టుల అభివృద్ధికి కృషి చేస్తున్న అపర భగీరదుడు ఉత్తమ్ అన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి గా రాష్ట్రం లో ఏ ప్రభుత్వం చేపట్టని పథకం సన్న బియ్యం పధకం అమలు చేస్తూ పేదల ఆకలి తీరుస్తున్న అన్నదాత ఉత్తమ్ అన్నారు. కోదాడ హుజూర్ నగర్ నియోజక వర్గాలు రెండు కళ్ల లా భావిస్తూ రెండు నియోజక వర్గాల్లో రోడ్లు, విద్యా, వైద్య, విద్యుత్,సాగు నీరు, తాగు నీరు, విద్యుత్ సదుపాయాల కోసం వేల కోట్ల రూపాయలు మంజూరు చేయించిన అభివృద్ధి ప్రదాత అన్నారు. ప్రజలే కుటుంబంగా భావించి దంపతులు ఇద్దరు రాజకీయాల్లో రాణిస్తూ ప్రజల గుండె ల్లో నిలిచారని కొనియాడారు. కోదాడ, హుజూర్ నగర్ నియోజక వర్గాల్లోనే కాదు సూర్య చంద్రులు ఉన్నంత వరకు మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే పద్మావతి ల పేరు రాష్ట్ర మొత్తం ఉంటుందన్నారు. ఉన్నత విద్యలు అభ్యసించి నేడు రాష్రాన్ని దేశంలో ఆదర్శం గా నిలుపుతున్న అపర మేధావి ఉత్తమ్ అన్నారు. దేశ విదేశాలు పర్యటించి రాష్ట్ర గొప్ప తనాన్ని ప్రపంచానికి చాటిన అగ్ర నాయకుడు ఉత్తమ్ అన్నారు. భగవంతుని ఆశీస్సులతో భవిష్యత్తు లో మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాక్షించారు.

కాగా వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానుల మధ్య భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తమ్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ భారీగా నినాదాలు చేశారు. పట్టణం లో భారీ కట్ అవుట్ లు కట్టి ఉత్తమ్ జన్మ దినం పండుగ లా చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచి ఎర్నేని వెంకటరత్నంబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలోనాయకులు అల్తాఫ్ హుస్సేన్, కోటిరెడ్డి, పాశం శీను, తోట జ్యోతి, నాగేంద్రమ్మ, నేహా నాజ్, ఉప్పుగల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ ఫయాజ్, కాంగ్రెస్ నాయకులు రావెళ్ళ కృష్ణారావు, మైలార్శెట్టి భాస్కర్, ఒంటిపులి శ్రీనివాస్, లైటింగ్ ప్రసాద్, కాజా, వేమూరి సతీష్, చందు నాగేశ్వరరావు, నెమ్మది దేవమణి ప్రకాష్ బాబు, మాతంగి శైలజ, కెజ్జమ్మ తదితరులు ఉన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular