Sunday, February 8, 2026
[t4b-ticker]

అంతర్జాతీయ యోగా పోటీలకు ఎంపికైన కె ఎస్ రావుకు ఘన సన్మానం

అంతర్జాతీయ యోగా పోటీలకు ఎంపికైన కె ఎస్ రావుకు ఘన సన్మానం

Mbmtelugunews//కోదాడ, జనవరి 12(ప్రతినిధి మాతంగి సురేష్):ఇటీవల జరిగిన ఆల్ ఇండియా మాస్టర్స్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2025–26 లో అద్భుత ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.కీతా శ్రీనివాసరావు విద్యాభ్యాసంలో M.Sc., M.A., B.Ed., M.Sc (Yoga) అర్హతలు సాధించారు. యోగాని శాస్త్రీయంగా ఆచరిస్తూ, శిక్షణ ఇవ్వడంలోనూ విశేష అనుభవం కలిగి ఉన్నారు. కె.ఎస్.రావును స్థానిక పెరిక భవన్ లో సూర్యాపేట జిల్లా పెరిక సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్, పెరిక సంఘం పెద్దలు ముత్తినేని వీరయ్య పాల్గొని కె ఎస్ రావుని గజమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ముత్తినేని వీరయ్య మాట్లాడుతూ యోగాలో జాతీయస్థాయిలో రాణించిన కేఎస్ రావును అభినందించడం పెరిక సంఘం కు ఎంతో అదృష్టమని ఆయన అన్నారు. రాబోయే రోజులలో కే ఎస్ రావు ఇంకా పెద్ద పెద్ద యోగ పోటీలలో పాల్గొనాలని అన్నారు. కే ఎస్ రావుకు పెరిక సంఘం తో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం రావడానికి నా వంతు కృషి చేస్తానని తెలిపారు.

అనంతరం మిత్రుడు మాతంగి సురేష్ కె ఎస్ రావును శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. సూర్యాపేట జిల్లా పెరిక సంఘం ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular