Sunday, February 8, 2026
[t4b-ticker]

మండల వ్యాప్తంగా ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

మండల వ్యాప్తంగా ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Mbmtelugunews//నడిగూడెం, జనవరి 26( ప్రతినిధి మాతంగి సురేష్): 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నడిగూడెం మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ రామకృష్ణారెడ్డి, ఎంపీడీవో మల్సూర్ నాయక్, ఏఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, ఏవో మల్సూర్, ఏపిఎం దుర్గాప్రసాద్, ప్రభుత్వ వైద్యశాల సూపరిండెంట్ విద్యాసాగర్, గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ చింతలపాటి వాణి, ప్రభుత్వ జూనియర్ కళాశాల విజయ నాయక్, విద్యుత్ అధికారి వెంకట్ గణేష్, ఎంఈఓ ఉపేందర్ రావు, గ్రంథాలయం వద్ద సర్పంచ్ దున్నా శ్రీనివాస్, పిఎసిఎస్ నడిగూడెం స్పెషల్ ఆఫీసర్ చంద్రకళ, వెటర్నరీ డాక్టర్ అఖిల, జడ్.పి.హెచ్.ఎస్ బాలుర ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు, జెడ్పిహెచ్ఎస్ బాలికల ప్రధానోపాధ్యాయులు కరుణ, నడిగూడెం పంచాయతీ యలక ఉమారాణి, టిడిపి కార్యాలయంలో గుండు నాగేశ్వరరావు,బిఆర్ఎస్ కార్యాలయంలో బోనగిరి ఉపేందర్, ఆయా పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు తమ తమ కార్యాలయాల వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం మాజీ వార్డు సభ్యులు పాతకోట్ల రాము గ్రామపంచాయతీ సిబ్బందిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు ఉప సర్పంచ్ లు, వార్డు సభ్యులు, ప్రజా ప్రతినిధిలు, మాజీ ప్రజా ప్రతినిధులు,ప్రభుత్వ అధికారులు, ఉపాధ్యాయులు,విశ్రాంత ఉద్యోగులు,అంగన్వాడి టీచర్లు, ఆశా కార్యకర్తలు , ఫీల్డ్ అసిస్టెంట్ లు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular