11వ వార్డు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా దొడ్డిగర్ల గీత నామినేషన్ దాఖల్
Mbmtelugunews//కోదాడ, జనవరి 30(ప్రతినిధి మాతంగి సురేష్): మున్సిపాలిటీ సాధారణ ఎన్నికలలో బాగంగా 11వ వార్డు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా దొడ్డిగర్ల గీత సత్యప్రసాద్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేసినారు. సందర్భంగా గీతా మాట్లాడుతూ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ సహాయ సహకారాలతో 11వ వార్డులో పోటీ చేస్తున్నారని తెలిపారు. గత మున్సిపల్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓటమిపాలైనానని తెలిపారు. గత ఐదు సంవత్సరాల నుండి వార్డులో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి వార్డు ప్రజల కష్టనష్టాలలో తోడున్నాను అందువలన ఈ వార్డుపై నాకు పూర్తిగా అవగాహన ఉన్నదని వార్డు ప్రజలు నాకు మాట ఇచ్చిన తర్వాతనే నామినేషన్ దాఖలు చేశానని తెలిపారు. ప్రజలు నన్ను ఆదరిస్తే వార్డును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతానని అన్నారు. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సహకారంతో కోదాడ మున్సిపల్ సాధారణ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ 25 నుండి 30 వార్డులలో ఘన విజయం సాధిస్తుందని అన్నారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో ఆనంతు సైదయ్య, దేవపంగు చిన్న శంబయ్య, మంద వెంకటప్పయ్య, దాసరి జయ సూర్య, మద్దెల వెంకయ్య,గుజ్జ బాబు, బీముడు, హుస్సేన్, వేముల వీరబాబు గౌడ్, పరశురాం యాదవ్, కే వెంకటేశ్వర్లు, కోటి, రవి, కిషోర్, డి రవి, లాజర్, రత్తయ్య, దేవపంగు అభి తదితరులు పాల్గొన్నారు.



