స్పర్శ్ కుష్టు వ్యాధి అవగాహన కార్యక్రమం
Mbmtelugunews//కోదాడ, జనవరి 30(ప్రతినిధి మాతంగి సురేష్): మాత్మ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని వివక్షను అంతం చేయడం గౌరవాన్ని కాపాడటం అనే నినాదంతో స్పర్శ్ కుష్టు వ్యాధి పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని దొరకుంట సర్పంచ్ పాలకి సురేష్ అన్నారు.మండల పరిధిలోని ద్వారకుంట గ్రామపంచాయతీలో స్పర్శ్ కుష్టు వ్యాధి పై అవగాహన కార్యక్రమం హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మీనా కుమారి పాల్గొని మాట్లాడుతూ కుష్టు వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, బాక్టీరియా ద్వారా వ్యాపిస్తుంది అని శరీరంపై స్పర్శ లేని రాగి రంగు మచ్చలు, కాళ్లు చేతులు తిమ్మిర్లు కలిగి ఉండడం ఏమైనా లక్షణాలు ఉన్నట్లయితే స్థానిక ఆశా కార్యకర్తలకు ఆరోగ్య సిబ్బందికి సమాచారం ఇచ్చినట్లయితే వారిని గుర్తించి నిర్ధారణ అయినట్లయితే వారికి ఎండిటి చికిత్స విధానం ద్వారా వ్యాధిని నయంచేయవచ్చని తెలపడం జరిగింది. ఆరోగ్య సిబ్బంది ప్రతి గ్రామంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించే సమయంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు సహకరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఏసోబు, ముండ్ర సుబ్బారావు, అహ్మద్, ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.



