Tuesday, February 3, 2026
[t4b-ticker]

మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన ఎర్నేని కుసుమ బాబు

మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన ఎర్నేని కుసుమ బాబు

:కోదాడ మున్సిపల్ 31వ వార్డులో గడప గడప కు ప్రచారం….

:ఎమ్మెల్యే పద్మావతి, మంత్రి ఉత్తమ్ ల సహకారం తో వార్డు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.

:మీ అమూల్యమైన ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థన.

Mbmtelugunews//కోదాడ, ఫిబ్రవరి 01(ప్రతినిధి మాతంగి సురేష్): మున్సిపల్ పరిధిలోని 31వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎర్నేని కుసుమ బాబు ఆదివారం మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. వార్డు లో గడప గడప కు వెళ్లి మీ అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీ గుర్తుపై వేసి నన్ను గెలిపించాలని అభ్యర్థించారు. ఎమ్మెల్యే పద్మావతి, మంత్రి ఉత్తమ్ ల సహకారం తో వార్డు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఓటర్లకు హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాలు అమలు కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం అన్నారు. వార్డు లో ఏ సమస్య ఉన్నా తప్పకుండా పరిష్కరిస్తా అన్నారు. వార్డు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటా నన్నారు. వార్డు లో తమ ప్రతి ఒక్కరు ఓటు వేసి అశ్వీర దించాలన్నారు.

రాజకీయాల్లో పూర్తి అనుభవం ఉన్న వ్యక్తులమని , ప్రజా సేవా కోసమే పని చేస్తున్నామన్నారు. కాగా వార్డు లో ప్రచారానికి మంచి స్పందన వస్తుంది.స్థానికులు కుసుమ వెంకట్ రత్నం బాబు తమ వద్దకు వచ్చిందని ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తూ తమ పూర్తి మద్దత్తు కుసుమ బాబు, ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ లకే నని సానుకూలత వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆర్ ధనమూర్తి,పార వెంకటేశ్వరరావు, సత్యం, ప్రసాద్,ఆర్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular