మరియమ్మ లాకప్ డెత్ మీద మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కర్ల రాజేష్ లాకప్ డెత్ పై ఎందుకు నోరు విప్పడం లేదు?
: ఎమ్మార్పీఎస్ అధినేత పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ.
Mbmtelugunews//నడిగూడెం, ఫిబ్రవరి 01(ప్రతినిధి మాతంగి సురేష్): గతంలో అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్ కు గురైన మరియమ్మ కోసం పీసీసీ అధ్యక్షుడిగా బలంగా పోరాటం చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు మంత్రిగా కర్ల రాజేష్ ను కోదాడ, చిలుకూరు పోలీసులు లాకప్ డెత్ చేస్తే ఎందుకు మౌనంగా ఉంటున్నారు ? ఈ దారుణం జరిగి రెండు నెలలు దాటినా ఎందుకు నోరు విప్పడం లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ప్రశ్నించారు. నడిగూడెం మండల కేంద్రంలో కర్ల రాజేష్ మాదిగ సంతాప సభను మొలుగురి సైదులు మాదిగ అధ్యక్షత ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ పాల్గొని ముందుగా రాజేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన సభను ఉద్దేశించి మాట్లాడుతూ గత ఎన్నికల్లో కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో 70% మాదిగలు ఉత్తమ్ దంపతులకు ఓట్లు వేశారని అన్నారు. కానీ ఆ మాదిగ సమాజం పట్ల వారు చిత్తశుద్ధితో లేరని కర్ల రాజేష్ లాకప్ డెత్ ఘటనతో రుజువైంది. కర్ల రాజేష్ అనే మాదిగ బిడ్డ లాకప్ డెత్ లో ప్రాణాలు కోల్పోతే అతని పక్షాన నిలబడకుండా, అతని ప్రాణాలు పోవడానికి కారణమైన ఎస్ఐ సురేష్ రెడ్డి పక్షాన నిలబడి అతన్ని కాపాడుతున్నారని అన్నారు. ఈ లాకప్ డెత్ ఘటన మీద కేసు నమోదు చేస్తే, ఆ కేసులో ఏ2 గా ఉన్న సీఐ ప్రతాప లింగంను సస్పెండ్ చేశారని, మరి ఏ1 గా ఉన్న సురేష్ రెడ్డిని నేటికీ ఎందుకు సస్పెండ్ చేయడం లేదని ప్రశ్నించారు. రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి కనుకనే సురేష్ రెడ్డిని ఉత్తమ్ దంపతులు కాపాడుతున్నారని అన్నారు. ఈ విషయం ఇప్పటికే రెండు నియోజకవర్గాలోని ప్రజలందరికీ అర్థమైందని అన్నారు. ఇకనైనా వారి వైఖరిలో మార్పు తెచ్చుకొని లాకప్ డెత్ మీద మౌనం వీడాలని, ఎస్ఐ సురేష్ రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.కర్ల రాజేష్ లాకప్ డెత్ ఘటనలో న్యాయం జరగాలని, కారకులైన పోలీసులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆద్వర్యంలో గత రెండు నెలలుగా పోరాటం చేస్తుంటే నేటికీ పోలీసు శాఖ ఉన్నాధికారుల నుండి ఎలాంటి సమాధానం గానీ, స్పందన గానీ, ఖండన గానీ లేదని అన్నారు. పైగా సాక్ష్యాధారాలను కనుమరుగు చేస్తూ కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నాలు చేశారని అన్నారు. పోస్టుమార్టం రిపోర్టు తమకు అనుకూలంగా వచ్చేలా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డితో పోస్టు మార్టం చేయించారని, దానిని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కోదాడ లోని రామకృష్ణ రెడ్డితో వీడియో తీయించారని అన్నారు. అయినా ఎమ్మార్పీఎస్ నిరంతరం సాక్ష్యాలను వెలికి తీసి ప్రజల ముందు పెడుతుందని అన్నారు. ఇప్పటికే ఈ విషయమై ఎస్పీ, డీజీపి, అడిషనల్ డీజీపీ, డీజీపి ( ఇంటిలిజెన్స్) కి కలిసిన నేటికీ వారి నుండి స్పందన లేదని అన్నారు. కర్ల రాజేష్ లాకప్ డెత్ కు ప్రధాన కారకుడైన చిలుకూరు ఎస్సై సురేష్ రెడ్డిని సస్పెండ్ చేసేంత వరకు, ఈ ఘటనలో పాల్గొన్న పోలీసులందరి మీద చట్టపరమైన శిక్షలు విధించేంత వరకు పోరాటం ఆగదని అన్నారు.అందులో భాగంగా ఫిబ్రవరి 5 న ఛలో సూర్యాపేటకు పిలుపునిస్తున్నామని, ప్రతి గ్రామం నుండి పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు పందిరి నవీన్ కుమార్, మండల అధ్యక్షులు గురవయ్య, బోనగిరి ఉపేందర్, బెల్లంకొండ సత్యనారాయణ, ఏసుబాబు, పాతకోట్ల శీను, మల్లెల వెంకన్న, దున్న అర్జున్, ఆంజనేయులు, అన్ని రాజకీయ పక్షాల నేతలు పాల్గొన్నారు.



