ఎంఈఎఫ్ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శిగా నందిపాటి రవి
Mbmtelugunews//కోదాడ, ఫిబ్రవరి 04(ప్రతినిధి మాతంగి సురేష్): ఎంఈఎఫ్ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి గా కోదాడ లో నీటి పారుదల శాఖలో పని చేయుచున్న నందిపాటి రవిని ఎంఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు దేవేంద్ర ప్రసాద్ మాదిగ, ఎంఈఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపాక వెంకన్న మాదిగ, ఎంఈఎఫ్ రాష్ట్ర కోశాధికారి చింతా జాన్ విల్సన్ మాదిగ ప్రకటించారు. ఈ సందర్భంగా ఎంఈఎఫ్ కోదాడ డివిజన్ అధ్యక్షులు ఆధ్యర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎంఈఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి డా, కత్తి వెంకటేశ్వర్లు, ఎంఈఎఫ్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు,వల్లంపట్ల కృష్ణ మాదిగలు పాల్గొని సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం సన్మాన గ్రహీత నందిపాటి రవి మాట్లాడుతూ ఇట్టి అవకాశానికి సహకరించిన జాతీయ ,రాష్ట్ర, జిల్లా బాధ్యులకు కృతఙ్ఞతలు తెలిపారు. నన్ను నమ్మి నాకు ఇంత బాధ్యతను ఇచ్చినందుకు యూనియన్ కు కట్టుబడి పని చేస్తానని యూనియన్ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ గౌరవ సలహాదారులు బొల్లికొండ కోటయ్య, మాగి గురవయ్య, దున్న వెంకటేశ్వర్లు, ఎంఈఎఫ్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు పిడమర్తి సైదులు, ఎంఈఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
ఏపూరి పర్వతాలు, ఎంఈఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు
పులి శ్రీనివాసరావు, ఎంఈఎఫ్ కోదాడ డివిజన్ ఉపాధ్యక్షులు కనకం అక్షపతి, ఎంఈఎఫ్ కోదాడ డివిజన్ ప్రధాన కార్యదర్శి మాదాసు బాబు, ఎంఈఎఫ్ కోదాడ డివిజన్ కోశాధికారి గంధం బుచ్చారావు పాల్గొన్నారు.



