మహిళలకు ఉచిత వైద్య శిబిరం
:కత్రం ఆరోగ్య సేవ ఆధ్వర్యంలో థైరాయిడ్ పరీక్షలు.
Mbmtelugunews//కోదాడ, మర్చి 08( ప్రతినిధి మాతంగి సురేష్): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కత్రం ఆరోగ్యసేవ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఆదివారం కోదాడలోని బాయ్స్ హై స్కూల్లో మహిళలకు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. అందులో భాగంగా మహిళలకు ఉచితంగా థైరాయిడ్ షుగర్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కత్రం ఆరోగ్య సేవ వైద్యురాలు డాక్టర్ కావ్య శ్రీ ఆధ్వర్యంలో మహిళలకు ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కావ్య శ్రీ మహిళల ఆహార అలవాట్లు జీవన విధానంలో మార్పులపై అవగాహన కల్పించారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఈ వైద్య శిబిరంలో మొత్తం 150 మంది మహిళలకు థైరాయిడ్ తదితర పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భం పలువురు మహిళలు మాట్లాడుతూ కత్రం చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కత్రం శ్రీకాంత్ రెడ్డి చేస్తున్న సేవలను కొనియాడారు. శిబిరానికి హాజరైన మహిళలకు నిర్వాహకులు అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కత్రం చారిటబుల్ ఫౌండేషన్ సభ్యులు బుడిగ రామాంజనేయులు, కత్రం కిరణ్ రెడ్డి కతం ఆరోగ్య సేవకు ఆర్డినేటర్ గౌతంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.



