గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజా పాలన
:సర్పంచ్ బల్గూరి స్నేహ దుర్గయ్య.
Mbmtelugunews//కోదాడ, మర్చి 10(ప్రతినిధి మాతంగి సురేష్): గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజా పాలన కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని గ్రామ సర్పంచ్ బల్గూరి స్నేహ దుర్గయ్య అన్నారు. మండల పరిధిలోని గణపవరం గ్రామ సర్పంచ్ బల్గూరి స్నేహ దుర్గయ్య ప్రజా పాలన కార్యక్రమానికి ఎంపీడీవో ఇసాక్ హుస్సేన్, ఎంపీఓ రాంబాబుని గ్రామానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అధికారులతో కలిసి గ్రామంలో ఉన్న పలు ముఖ్యమైన పనులను పరిశీలించారు. త్వరలో జరగనున్న శ్రీ వర వర రంగనాయక స్వామి వారి కళ్యాణం మహోత్సవ కార్యక్రమానికి కావలసిన వాటర్ ఫెసిలిటీ,రవాణా సౌకర్యాలు, శాంతి భద్రతలు, హెల్త్ క్యాంప్, గురించి అధికారులను అభ్యర్ధించడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో ఉన్న నర్సరీ, హైస్కూల్, ప్రైమరీ స్కూల్‌ను సందర్శించి అక్కడి బోధనా విధానం 10వ తరగతి విద్యార్థుల పరీక్షల సిద్ధత గురించి టీచర్లను అడిగి తెలుసుకుని తగిన సూచనలు చేశారు. అలాగే విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని కూడా పరిశీలించారు. గ్రామంలోని వెటర్నరీ ఆసుపత్రి నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించి అక్కడి సేవల పరిస్థితిని తెలుసుకున్నారు. మహిళల సాధికారత కోసం గ్రామంలో ఎస్ హెచ్ జి పొదుపు సంఘాల మహిళల కోసం నిర్మించబడుతున్న మీటింగ్ హాల్ పనుల గురించి సర్పంచ్ బల్గూరి స్నేహ దుర్గయ్య గారు అధికారులకు వివరించారు.
తదుపరి గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో గ్రామంలో ఉన్న వివిధ సమస్యలు, అభివృద్ధి అవసరాలు, ప్రజల అవసరాల గురించి సర్పంచ్ బల్గూరి స్నేహ దుర్గయ్య అధికారులకు సమగ్రంగా వివరించి, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామ అభివృద్ధి ప్రజల సంక్షేమం కోసం గణపవరం గ్రామ పంచాయతీ నిరంతరం కృషి చేస్తోంది. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి జీవిత రెడ్డి, ఏఎన్ఎం విజయలక్ష్మీ, జిపిఓ అన్నపూర్ణ, 9వ వార్డు మెంబర్ బండి చిన కోటయ్య, కాసాని శ్రీను, పోశం శ్రీను, కొండ ధనమూర్తి, బలుగూరి నాగస్వరప్, ఇర్ల నర్సిరెడ్డి, శ్యామకురి గురవయ్య, జంగం గాంధీ, అమరబోయిన లక్ష్మయ్య, పోశం కృష్ణయ్య, శెట్టి అప్పారావు,పిడమర్తి పుల్లయ్య గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



