కోదాడ మండల అభివృద్ధి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికే సాధ్యం
:సర్పంచ్ పాలకి సురేష్
Mbmtelugunews//కోదాడ, మర్చి 10( ప్రతినిధి మాతంగి సురేష్): కోదాడ మండల అభివృద్ధి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి సాధ్యమని దొరకుంట సర్పంచ్ పాలకు సురేష్ అన్నారు. మండల పరిధిలోని దొరకుంట నుండి కాపుగల్లు రోడ్డు 14 కోట్లతో డబల్ రోడ్ గా శాంక్షన్ చేయించిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిని సోమవారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిసి శాలవా, బొకేతో ఘనంగా సత్కరించిన సర్పంచ్ పాలకే సురేష్ గ్రామ పెద్దలు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ దొరకుంటకు కాపుగల్లు కు ఎనలేని సంబంధాలు ఉన్నాయని ఆ సంబంధాలు కొనసాగాలంటే రహదారులు ప్రధానమని అలాంటి రహదారిని 14 కోట్లతో డబల్ రోడ్డుగా శాంక్షన్ చేయించిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపినారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు పత్తిపాక వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ గద్దల వెంకటేశ్వర్లు, పత్తిపాక కృష్ణ, ఒగ్గు నాగేంద్రబాబు, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.



