Sunday, March 15, 2026
[t4b-ticker]

చింతలపాలెం మండలంలో పదవ తరగతి పరీక్షా కేంద్రం లేకపోవడంతో విద్యార్థులు మేళ్లచెరువు మండలానికి వెళ్లాల్సి వస్తోంది.

చింతలపాలెం మండలంలో పదవ తరగతి పరీక్షా కేంద్రం లేకపోవడంతో విద్యార్థులు మేళ్లచెరువు మండలానికి వెళ్లాల్సి వస్తోంది.

Mbm telugu news: ఏడాది మండలంలోని 4 ప్రభుత్వ పాఠశాలల నుండి 108 మంది, 5 ప్రైవేటు పాఠశాలల నుండి 136 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. మొత్తం 244 మంది విద్యార్థులలో 121 మంది బాలికలు, 123 మంది బాలురు ఉన్నారు.
స్థానికంగా పరీక్షా కేంద్రం అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు మేళ్లచెరువు మండలానికి వెళ్లాల్సి వస్తోంది. ఇందుకోసం ఆటో ఛార్జీల రూపంలో ఒక్కో విద్యార్థి రూ. 420 నుండి రూ. 500 వరకు అదనంగా చెల్లించాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. ఆర్థిక భారంతో పాటు ప్రయాణానికి ఎక్కువ సమయం పడుతుండటంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నామని వారు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి, చింతలపాలెం మండల కేంద్రంలోనే పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular