అక్రమంగా ‘పౌతి’ చేసిన నాయబ్ తహశీల్దార్ సస్పెన్షన్.. జిల్లా కలెక్టర్ ఆదేశం
సూర్యాపేట/మేళ్లచెర్వు/mbmtelugunews/మార్చి, 23:-విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన మేళ్లచెర్వు నాయబ్ తహశీల్దార్ శ్రీధర్ నాయక్ సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ మేరకు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఉత్తర్వులు జారీ చేశారు.
కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా అక్రమ పద్ధతిలో పౌతి (సక్సెషన్) చేసినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన కలెక్టర్, అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినందుకు గానూ శ్రీధర్ నాయక్ ను విధులనుంచి తొలగిస్తూ (సస్పెండ్ చేస్తూ) కలెక్టర్ కఠిన నిర్ణయం తీసుకున్నారు.
రెవెన్యూ రికార్డుల విషయంలో అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు.
అక్రమంగా ‘పౌతి’ చేసిన మేళ్లచెరువు నాయబ్ తహశీల్దార్ సస్పెన్షన్
RELATED ARTICLES



