చింతలపాలెం, మార్చి 26, mbmtelugunews.com //:-
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో గురువారం లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. స్థానిక ఎమ్మార్వో సూరయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నరాల కొండారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి మండలంలోని వివిధ గిరిజన తండాలకు చెందిన లబ్ధిదారులకు ఈ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పేద కుటుంబాల్లో ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలు అందేలా చూస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నరాల కొండారెడ్డి, రాములు నాయక్, చింతలపాలెం వార్డ్ మెంబర్ మోర్తాల సీతారెడ్డి, కొత్తగూడెం గ్రామ సర్పంచ్ మాలవతు శారద సామ్య, చింతలపాలెం కాంగ్రెస్ గ్రామ శాఖ నాయకులు దొండపాటి వెంకటరెడ్డి, ఎర్రగుంట తండా మాజీ సర్పంచ్ బుజ్జి హుస్సేన్, సిపిఐ పార్టీ మండల నాయకులు చిత్తలూరి వీరబాబు, రెవెన్యూ సిబ్బంది మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.
చింతలపాలెం మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
RELATED ARTICLES



