ఆపదకాలంలో ఆసరాకు సబ్సిడీ పై పశుగ్రాస విత్తనాలు సిద్ధం
:వేసవిలో పశుగ్రాస కొరత అధిగమించడానికి పశుపోషకులకు మంచి అవకాశం.
:డా పి పెంటయ్య, అసిస్టెంట్ డైరెక్టర్
Mbmtelugunews//కోదాడ, మార్చి 30(ప్రతినిధి మాతంగి సురేష్): పట్టణం ప్రాంతీయ పశువైద్యశాలలో సబ్సిడీ పై పశుగ్రాస విత్తనాల అందుబాటులో ఉన్నాయి కావున పశుపోషకులు సద్వినియోగం చేసుకోగలరని ప్రాంతీయ వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పి పెంటయ్య అన్నారు. అనంతరం డాక్టర్ పి పెంటయ్య మాట్లాడుతూ
వేసవి వస్తుందంటేనే పశుపోషకుల గుండెల్లో భయం మొదలవుతుంది. భగ భగ మండే ఎండలతో పోటీగా మండే గడ్డి ధరలకు, గడ్డి కొనలేక, పశువుల్ని బైట తోలి మేపడానికి పచ్చిక లేక, ఎండ తాకిడి ఒక వైపు రోడ్డు ప్రమాదాలు, కరెంట్ తీగలు నీరు నిండిన బావులు ఒక వైపు పశువుల ప్రాణాలు తీయడానికి సిద్ధంగా ఉండడమే భయానికి కారణం. ఇలాంటి విపత్కర పరిస్థితులను అధిగమించడానికి పంట కోయగానే భూమి వనరులు ఉన్న పశుపోషకులు గడ్డి జొన్న పెంచుకొని వేసవిలో గడ్డికొరత అధిగమించడానికి ప్రభుత్వం 75 శాతం సబ్సిడీతో పశుగ్రాస విత్తనాలను పశువైద్యశాలల్లో పంపిణీకి సిద్ధంగా ఉంచింది అన్నారు. అన్ని కాలాలను తట్టుకొని పెరిగే ఈ గడ్డి జొన్న భూమి ఉన్న రైతులతో పాటు భూమిలేనివారు కౌలు భూమిలో కూడా వేసుకోవచ్చని గడ్డి కొనడం కంటే పెంచిన ఖర్చు చాలా తక్కువని సూచించారు. ప్రత్యేకమైన పశుగ్రాస జొన్న గడ్డి పశువులకు కావలసిన శక్తి పీచు ఇతర మూలకాలు కలిగిన బలమైన పచ్చిమేత అని ఏపాటి కొద్దిగా సౌకర్యాలున్నా రైతులు ఆలస్యం చేయకుండా గడ్డిజొన్న సాగుచేసుకోవాలని అన్నారు. పశువుకి ఆరోగ్యం, పాలదిగుబడి పుష్కలం, రైతుకేమో అదనపు ఆదాయం పశోషకులకేమో ఖర్చు తగ్గి లాభాలను పెంచే పచ్చి పశుగ్రాసాన్ని ప్రతి ఒక్కరూ వేసుకోవాలని సూచించారు. 5 కిలోల ప్యాకింగ్ తో ఉన్న గడ్డి జొన్నలు అసలు ధర కాగా. రూ 435/ కాగా రూ. సబ్సిడీ పోను. రూ 109 /-అందివ్వడం జరిగిందని చెబుతూ గడ్ఫిజొన్నలకు వచ్చే రైతులు ఆధార్ కార్డు, చరవాణి నెంబరు తీసుకు రావాలని, ఈ వివరాలను అదే రోజు భారత్ పశుదాన్ అప్ లో అప్ లోడ్ చేయడం జరుగుతుందని, తద్వారా అంతర్జాలం ద్వారా సైతం ఈ వేసవిలో ఎంత గడ్డి అదనంగా పెంచారు ఎన్ని పశువులకు లబ్ధి చేకూరింది అన్న విషయాలు ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది అన్నారు.పశుపోషకుల అవగాహనా కార్యక్రమములో కోదాడ మండల పశువైద్యాధికారి డా బుక్యా మధు, సిబ్బంది రాజు, సాగర్, రాజేష్ వివిధ మండలాల పశుపోషకులు పాల్గొన్నారు.



