వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనది: సర్పంచి దున్నా శ్రీనివాస్.
Mbmtelugunews//నడిగూడెం 28( ప్రతినిధి మాతంగి సురేష్ ): వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని నడిగూడెం గ్రామ సర్పంచి దున్నా శ్రీనివాస్ అన్నారు. మంగళవారం నడిగూడెం మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం నందు సూపరింటెండెంట్ గా బాధ్యతలు నిర్వహించిన డాక్టర్ విద్యాసాగర్, డాక్టర్ శృతి లు బదిలీపై వెళ్లడంతో వారికి ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ సూపరింటెండెంట్ గా విధులు నిర్వహించిన విద్యాసాగర్, డాక్టర్ శ్రుతిలు ఎంతో పేరు సంపాదించుకున్నారని, అంకితభావంతో పనిచేశారని తెలిపారు. విధులు ఎక్కడ నిర్వహించిన వైద్యశాలకు వచ్చే రోగులకు 24 గంటలు అందుబాటులో ఉంటూ సకాలంలో వైద్యం అందించాలని వైద్యులను కోరారు. అనంతరం బదిలీపై వెళ్లిన డాక్టర్ విద్యాసాగర్ ను గ్రామ ఉపసర్పంచి ఎలుగూరి నాగరాజు, డాక్టర్లను శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో డిసిహెచ్ఓ వెంకటేశ్వర్లు, డాక్టర్లు శ్రీనివాస్, ఫణిశ్వర్, రమేష్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



