నాణ్యతా ప్రమాణాలతో ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలి.
:కోదాడ ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్
Mbmtelugunews//కోదాడ, జూలై 28( ప్రతినిధి మాతంగి సురేష్): ప్రజా సంక్షేమలో భాగంగా ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని ఇందులో భాగంగానే కోదాడ 100 పడకల అసూపత్రిని నిర్మిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్ తెలిపారు. మంగళవారం కోదాడ ఏరియా అసూపత్రిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ కోదాడ 100 పడకల ఆసుపత్రిని నాణ్యతతో నిర్మించాలని అధికారులను ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలలో రాజీ పడొద్దని నాణ్యతలో ఏమైనా తేడాలు ఉంటే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రోగులకు ఇబ్బంది కలగకుండా మెట్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఆసుపత్రిలోని వార్డులు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించాల న్నారు. ఆస్పత్రికి సరిపడా పారిశుద్ధ్య సిబ్బందిని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తా అన్నారు. ఆసుపత్రుల్లో గర్భిణిలకు సాధారణ ప్రసవం జరిగేలా చుడాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ సూర్యనారాయణ, ఆస్పత్రి సూపరింటెండెంట్ దశరథ నాయక్, తహసిల్దార్ సంతోష్ కిరణ్, డాక్టర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



