Saturday, April 11, 2026
[t4b-ticker]

పశు ఔషధ బ్యాంక్ నకు ఎన్ ఆర్ ఐ 45 వేల సర్జరీ పనిముట్ల విరాళం

పశు ఔషధ బ్యాంక్ నకు ఎన్ ఆర్ ఐ 45 వేల సర్జరీ పనిముట్ల విరాళం

:జంతుప్రాణ రక్షణకు ఆర్థోపెడిక్ సర్జరీ పరికరాలు అత్యంత కీలకం

:డా, పి. పెంటయ్య

Mbmtelugunews//కోదాడ, ఏప్రిల్ 10( ప్రతినిధి మాతంగి సురేష్): పట్టణ ప్రాంతీయ పశువైద్యశాలలో దేశంలోనే ఒక మోడల్ గా పశు ఔషధ బ్యాంక్ నిర్వహిస్తున్నారు. స్థానిక అసిస్టెంట్ డైరెక్టర్ డా, పి.పెంటయ్య ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఔషధ బ్యాంకు గురించి వివిధ సామాజిక మాధ్యమాలలో వస్తున్న వార్తలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైజాగ్ కు చెందిన ఎన్ఆర్ఐ డా, చప్పిడి సుధాకర్ చూసి పశు ఔషధ బ్యాంక్ సేవలను తెలుసుకొని మూగ జీవాల సేవలో తానుసైతం ఒక చేయివేసి సాయం చెయ్యాలనే సంకల్పంతో 45 వేల రూపాయల విలువైన ఆర్థోపెడిక్ సర్జికల్ పరికరాలను విరాళంగా అందించారు. పనిముట్లను స్వీకరించిన సందర్భంగా అసిస్టెంట్ డైరెక్టర్ మాట్లాడుతూ డా సుధాకర్, వారి కుటుంబ సభ్యులు గత సంవత్సరం లో సైతం పశు ఔషధాలను విరాళంగా అందించారని, జంతు సేవలో అంతటితో సంతృప్తి చెందకుండా కోదాడ ప్రాంతీయ పశు వైద్యశాల లో నిర్వహించే ఆపరేషన్లకి ఏ ఏ పనిముట్లు అవసరమో తెలుసుకుని, అత్యవసర పరిస్థితుల్లో సైతం పశువుల ప్రాణాల్ని కాపాడ డానికి, ఎముకలను అతికించడానికి అన్ని సైజుల ప్లేట్లు, రాడ్లు, ప్లేట్ బెండర్స్, స్క్రూ సెట్, ఎముకల కట్టర్, ఎముకలను, కండరాలను పట్టి ఉంచే ఫోర్సెప్స్ ( పట్టాకార్లు), సిమెంట్ కట్టు తొలగించే పరికరం, స్టీల్ డ్రిల్ల్ మిషన్, రాడ్ల కట్టర్లు, కుట్ల దారాలు, స్టీల్ వైర్లు,పశువుల్ని తూచే మిషన్ ఇంకా రకరకాల పరికరాలు అందించడం అభినందనీయం అని, మూగజీవాలపై డా సుధాకర్ ప్రేమ అంతులేనిది అని అన్నారు. ఈ పరికరాలు పశువుల ప్రాణాల రక్షణలో ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ అసిస్టెంట్ డైరెక్టర్ తో పాటు సిబ్బంది రాజు, చంద్రకళ, సాగర్, రాజేష్ ఉన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular