ఉచిత పాలిటెక్నిక్, టిఎస్ ఆర్ జెసి కోచింగ్ ను సద్వినియోగం చేసుకోవాలి.
Mbmtelugunews//కోదాడ, ఏప్రిల్ 10(ప్రతినిధి మాతంగి సురేష్): అంబేద్కర్ ఆశయ సాధన కేంద్రం (ఆస్క్) కోదాడ ఆధ్వర్యంలో
ఉచిత పాలిటెక్నిక్, టిఎస్ ఆర్ జెసి కోచింగ్ కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెస్ కళాశాలలో శుక్రవారం ఆస్క్ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆస్క్ అధ్యక్షురాలు బల్గూరి స్నేహ దుర్గయ్య, ఎమ్మెస్ కళాశాలల చైర్మన్ పందిరి నాగిరెడ్డి, 20 వ వార్డ్ కౌన్సిలర్ జిల్లపల్లి నాగేశ్వరావు,34 వ గంధం బాలేంద్ర పాండు లు పాల్గొని కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆస్క్ అధ్యక్షరాలు స్నేహ దుర్గయ్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆస్క్ ఆధ్వర్యంలో
నిర్వహించే ఉచిత పాలిటెక్ ని 14-04-2026 న ఎమ్మెస్ కళాశాల,కోదాడ లో ఉచిత పాలిటెక్నిక్ టి ఎస్ ఆర్ జె సి కోచింగ్ ప్రారంభించబడుతుంది. కావున ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని కోరారు. ప్రతి సంవత్సరం సబ్జెక్టులో మంచి ప్రావీణ్యత కలిగిన ఉపాధ్యాయ బృందంచే ఉచితంగా శిక్షణ అందించబడుతుందని తెలిపారు. కార్పొరేటు కోచింగ్ సెంటర్లను నమ్మి వేలకు వేలు డబ్బులు వృధా చేసుకోకుండా ఈ ఉచిత పాలిటెక్నిక్ ను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో
ఆస్క్ ప్రధాన కార్యదర్శి
మాతంగి ప్రభాకర్ రావు, జడ్పీహెచ్ఎస్ బేతవోలు జిహెచ్ఎం మాగి గురవయ్య, కోర్స్ డైరెక్టర్
యలమర్తి శౌరి, కోర్సు కోఆర్డినేటర్
గంధం బుచ్చరావు,
కుడుముల స్వామి దాసు, నందిపాటి సైదులు,
అమరబోయిన వెంకటరత్నం, బొడ్డు హుస్సేన్, చేకూరి రమేష్, ఇరుగు కిరణ్ కుమార్, మేళ్లచెరువు వీరభద్రం, షరీఫ్, శ్రీకాంత్
తదితరులు పాల్గొన్నారు. వివరాలకు 9666763660ను సంప్రదించగలరు.



