14 సంవత్సరాల పిల్లలకు హెచ్ పి వి వ్యాక్సినేషన్ వేయించాలి
:ఆరోగ్యంవంతమైన తెలంగాణగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి
: సర్పంచి మందుల నాగయ్య
Mbmtelugunews//కోదాడ, ఏప్రిల్ 20( ప్రతినిధి మాతంగి సురేష్):14 సంవత్సరాల నిండిన బాలికలకు హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ వేయించి ఆరోగ్యవంతమైన తెలంగాణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సర్పంచి మందుల నాగయ్య అన్నారు. మండల పరిధిలోనే గుడిబండ గ్రామంలో గల గ్రామపంచాయతీ ఆవరణంలో హెచ్ పి వి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచి మందుల నాగయ్య ముఖ్య అతిథిగా పాల్గొని వ్యాక్సినేషన్ ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హెచ్ పి వి వ్యాక్సిన్ ప్రభుత్వము ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది కావున 14 సంవత్సరాల లోపు ఆడపిల్లలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వ్యాక్సిన్ చేయడం వల్ల ముందు జాగ్రత్తగా గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ ను నివారించవచ్చని తెలిపారు. ఈ వ్యాక్సిన్ విలువైనది కావున ప్రజలు సద్వినియోగం చేసుకోని ఆరోగ్యవంతమైన గ్రామంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్ఎల్ హెచ్ పి డా, నాగూర్ బి, సూపర్వైజర్ సిద్ధమ్మ, ఏఎన్ఎం చంద్రకళ, హెల్త్ అసిస్టెంట్ విజయ్, సెక్రటరీ అవినాష్ రెడ్డి, జిపిఓ ఈశ్వర్,
వెంకయ్య, గురునాథం, సూరయ్య, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



