Wednesday, April 22, 2026
[t4b-ticker]

అంబేద్కర్ ఆశయ సాధన కేంద్రం సేవలు మరువ లేనివి

అంబేద్కర్ ఆశయ సాధన కేంద్రం సేవలు మరువ లేనివి

Mbmtelugunews//కోదాడ, ఏప్రిల్ 21(ప్రతినిధి మాతంగి సురేష్): పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉచిత కోచింగ్ లు ఏర్పాటు చేయడం అభినందనీయమని శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరశెట్టి నాగరాజు తెలిపారు. మంగళవారం కోదాడ పట్టణంలోని ఎంఎస్ జూనియర్ కాలేజ్ లో అంబేద్కర్ ఆశయ సాధన కేంద్రం (ఆస్క్) ఆధ్వర్యంలో వేసవిలో 10 వ తరగతి పూర్తి పరీక్షలు రాసిన విద్యార్ధులు పాలిటెక్నిక్, టీజీఆర్ జెసి లలో ప్రవేశానికి ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరశెట్టి నాగరాజు రమేష్ కళాశాలలో ఆస్క్ సభ్యులకు కొంత నగదును అందించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన కేంద్రం 2012లో స్థాపించి 15 సంవత్సరముల పాటు పేద విద్యార్థులకు గతంలో వీఆర్వో, వీఆర్ఏ, కానిస్టేబుల్స్ ఉద్యోగాల కొరకు కోచింగ్ తీసుకొని ఎంతోమంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించి స్థిరపడడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో చదువుతున్న విద్యార్థులు కోచింగ్ ద్వారా రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించి పాలిటెక్నిక్, టిజి ఆర్ జేసి లో సీట్లు సాధించడం గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఆశయ సాధన కేంద్రం కోర్స్ డైరెక్టర్ యలమర్తి శౌరి, కోర్స్ కోఆర్డినేటర్ గంధం బుచ్చారావు, ఆస్క్ ప్రధాన కార్యదర్శి మాతంగి ప్రభాకర్, రావు, కన్నయ్య సార్, నిర్వాహకులు, అధ్యాపక బృందం పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular