Sunday, April 26, 2026
[t4b-ticker]

ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది….

ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది….

కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం….

ఉద్యోగులకు ఇచ్చిన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరిస్తుంది…

ప్రభుత్వం డిమాండ్ల అంగీకారం పై కోదాడ ఆర్టీసీ డిపోలో కార్మికుల పాలాభిషేకం ఉత్సవాలు…

Mbmtelugunews//కోదాడ, ఏప్రిల్ 26(ప్రతినిధి మాతంగి సురేష్): ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, వైస్ చైర్ పర్సన్ దేవరపల్లి మల్లేశ్వరి లు అన్నారు. ఆదివారం కోదాడ ఆర్టిసి డిపోలో ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను అంగీకారం పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్,ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతి ఫ్లెక్సీ లకు నిర్వహించిన పాలాభిషేకం కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అన్నారు. ఉద్యోగ కార్మికులకు ఇచ్చిన హామీలు అన్ని అమలు చేస్తుందన్నారు. మహా లక్ష్మీ పథకం అమలు లో ఆర్టీసీ కార్మికుల సేవలు ప్రశంస నీయం అన్నారు. ఆర్టీసీ నీ గత ప్రభుత్వం నిర్వర్యం చేసిందన్నారు. తమ ప్రభుత్వం వచ్చి మహా లక్ష్మీ మహిళల కు ఉచిత బస్సు పథకం పెట్టి ఆర్టీసీ కి వైభవం తెచ్చిందన్నారు. ఆర్టీసీ కార్మికులు సమిష్టి గా పని చేస్తూ ఆర్టీసీ నీ లాభాల బాట లోకి తెచ్చారని కార్మికుల సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా పలువురు ఆర్టిసి నాయకులు మాట్లాడుతూ తమ డిమాండ్ లు అంగీకరించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ శ్రీనివాసరావు, యూనియన్ నాయకులు బి పుల్లయ్య, చక్రపాణి, ఎస్ఎస్ గౌడ్, అబ్దుల్, ఎస్ జానయ్య, ఎన్వి చారి, రాజశేఖర్, సుధారాణి, శ్రీదేవి, నాగమణి, రవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular