Tuesday, May 12, 2026
[t4b-ticker]

10 కోట్లు విలువ చేసే స్థలం కబ్జా పై ఆర్డీవో కార్యాలయం ముందు నిరసన

10 కోట్లు విలువ చేసే స్థలం కబ్జా పై ఆర్డీవో కార్యాలయం ముందు నిరసన

:టిఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ఎం శ్రీకాంత్ యాదవ్

Mbmtelugunews//కోదాడ, మే 11(ప్రతినిధి మాతంగి సురేష్): పట్టణ పరిధిలోని 32 వ వార్డు లో విలువైన భూమి నీ అధికార పార్టీకి సంబంధించిన కొందరు నాయకులు కబ్జా చేసి అందులో ఒక కంటైనర్ ను నిలిపి పట్ట పగలే భూ కబ్జా కి తెర లేపడం జరిగింది. 10 కోట్ల కు పైగా విలువ చేసే ఇట్టి ప్రభుత్వ భూమి కబ్జా పై నోరు మెదపని స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి చర్యలు తీసుకోవాలని సోమవారం గ్రీవెన్స్ సందర్భం గా టిఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ఎం శ్రీకాంత్ యాదవ్, సామాజిక కార్యకర్తలు ఆర్డీవో కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చెయ్యడం జరిగింది.

ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకుని వెంటనే ఆ భూమి నీ స్వాధీన పరచుకొని కబ్జా చేసిన వారి పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ రమాదేవి మాట్లాడుతూ ఈ రోజు సాయంత్రం వరకు కంటైనర్ ను తొలగిస్తాం అని ఆర్డిఓ సమక్షంలో హామీ ఇవ్వడం జరిగింది. అధికారులు స్వాధీన పరచుకోకపోతే పట్టణ ప్రజల తో కలిసి భారీ ఎత్తున పోరాటాలు చేస్తాం అని ఆ కబ్జా స్థలం లోనే ఆమరణ దీక్షలు చేస్తాం అని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాదాల ఉపేందర్, పొడుగు హుస్సేన్, కుదరవెల్లి బసవయ్య, ప్రేమ్ కుమార్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular