Thursday, September 24, 2026
[t4b-ticker]

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కు ప్రశంసా పత్రం

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కు ప్రశంసా పత్రం

Mbmtelugunews//కోదాడ, జూన్ 02(ప్రతినిధి మాతంగి సురేష్): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన అధికారిక వేడుకల సందర్భంగా పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ కోదాడకు విశిష్ట గుర్తింపును పొందింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక (మార్చి 6 నుండి జూన్ 12, 2026 వరకు)లో భాగంగా మే 11 నుండి మే 25 వరకు నిర్వహించిన సమ్మర్ క్యాంప్ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్య సంరక్షణ, చెట్ల పెంపకం, ప్రకృతి పట్ల బాధ్యత, సామాజిక చైతన్యంపై విస్తృత అవగాహన కల్పించినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందానికి ప్రశంసా పత్రం అందజేయబడింది. సమ్మర్ క్యాంప్‌లో యోగా, డ్రాయింగ్, డ్యాన్స్, క్రీడలు, కంప్యూటర్ విద్య, సైన్స్ ప్రయోగాలు, వ్యక్తిత్వ వికాసం, పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్య అవగాహన, మొక్కల పెంపకం వంటి అనేక కార్యక్రమాలను నిర్వహించి విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి విశేష కృషి చేశారు. ఈ ప్రశంసా పత్రాన్ని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా పోలీసు శాఖ అధికారి నరసింహ, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, జిల్లా పర్యావరణ శాఖ అధికారి దేవరాజు సమక్షంలో ప్రదానం చేశారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ విద్యార్థుల్లో పర్యావరణ చైతన్యం, ప్రకృతి పట్ల బాధ్యత, జీవవైవిధ్య పరిరక్షణ పట్ల అవగాహన కల్పించడంలో పీఎం శ్రీ జడ్పిహెచ్ఎస్ కోదాడ చేపట్టిన కార్యక్రమాలు ఆదర్శప్రాయంగా ఉన్నాయని కొనియాడారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల సమిష్టి కృషికి గుర్తింపుగా అందించిన ఈ ప్రశంసా పత్రం పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో కూడా విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, పర్యావరణ పరిరక్షణ భావనలను పెంపొందించే కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular