Thursday, September 24, 2026
[t4b-ticker]

రైతుల చేత పౌర సన్మానం పొందిన విద్యుత్ కార్మికుడు

రైతుల చేత పౌర సన్మానం పొందిన విద్యుత్ కార్మికుడు

:రైతుల మన్ననలు పొందిన ఏకైక విద్యుత్ కార్మికుడు నాదెళ్ల బాలకృష్ణ

: శ్రమశక్తి అవార్డుకు అర్హులు నాదెళ్ల బాలకృష్ణ

:సర్పంచి బల్గూరి స్నేహ దుర్గయ్య

Mbmtelugunews//కోదాడ, జూన్ 03:తెలంగాణ రాష్ట్రములో రైతుల చేత పౌర సన్మానం పొందిన విద్యుత్ కార్మికుడు నాదెళ్ల బాలకృష్ణ అని సర్పంచి బల్గూరి స్నేహ దుర్గయ్య అన్నారు. మండల పరిధిలోని గణపవరం గ్రామంలో మే 1 ప్రపంచ కార్మిక దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోదాడ మండల సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ నాదెళ్ల బాలకృష్ణ కు శ్రమశక్తి అవార్డును ప్రధానం చేసిన సందర్భంగా గ్రామంలోని రైతులు, ప్రజలు, నాయకుల ఆధ్వర్యంలో స్థానిక గ్రంథాలయంలో పౌర సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచి బల్గూరి స్నేహ దుర్గయ్య పాల్గొని సన్మాన గ్రహీతను శాలువా బొకేతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2024 లో తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన వరదల విపత్తుకు గణపవరం గ్రామంలో విద్యుత్ స్తంభాలు పడిపోయి విద్యుత్ సమస్య ఏర్పడినప్పుడు బాలకృష్ణ తక్కువ రోజులలో సమస్యను అధిగమించాడని అన్నారు. గ్రామంలో కరెంటు సమస్య వచ్చిందంటే అది చిన్న పెద్ద అనే తేడా లేకుండా సమస్యను తక్షణమే పరిష్కరిస్తాడని అన్నారు. రైతులు మాట్లాడుతూ కరెంటు సమస్య వచ్చినప్పుడు కన్జ్యూమర్ ఇబ్బంది పడకుండా ఆ సమస్యను పరిష్కరిస్తాడని అన్నారు.

విద్యుత్ వినియోగంపై రైతులకు అవగాహన కల్పిస్తూ అదే విధంగా రైతులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన కరెంటు బకాయిలను రైతులతో చెల్లించేవారని అన్నారు. అనంతరం సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ నాదెళ్ల బాలకృష్ణ మాట్లాడుతూ వినియోగదారులకు ఎప్పుడు విద్యుత్ సమస్య వచ్చిన నేను ముందుండి పరిష్కరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచి శంకరశెట్టి కోటేశ్వరరావు, మాజీ సర్పంచి కామిశెట్టి కృష్ణవేణి నరసింహారావు, కాంగ్రెస్ మండల పార్టీ ఉపాధ్యక్షులు ఇర్ల సీతారామరెడ్డి, దేవాలయ చైర్మన్ ఇర్ల వరాల్ రెడ్డి, మాజీ చైర్మన్ ఇర్ల నారపరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు జాబిశెట్టి నాగప్రసాద్, మాజీ ఉపసర్పంచి పోశం కృష్ణయ్య, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ పోశం ఎర్రకొండలు, సంపేట శ్రీనివాసరావు, పోటు ప్రసాద్, ఇర్ల శ్రీనివాసరెడ్డి, కాసాని శ్రీను, గునుకుల కోటిరెడ్డి, ముడియాల బ్రహ్మారెడ్డి, రంజిత్, వెంకన్న, విద్యుత్ సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular