ఘనంగా తెలంగాణ రూపకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంత్యుత్సవాలు
:సర్పంచి మందుల నాగయ్య
Mbmtelugunews//కోదాడ, ఆగష్టు 06(ప్రతినిధి మాతంగి సురేష్): మండల పరిధిలోని గుడిబండ గ్రామపంచాయతీ ఆవరణంలో తెలంగాణ , రూపశిల్పి ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచి మందుల నాగయ్య మాట్లాడుతూ విద్యా, ఉద్యోగ,ఆర్ధిక సామాజిక అభివృద్ధిలో తెలంగాణ ను అగ్రపథానంలో నిలపడం లో ప్రతి ఒక్కరం భాగస్వాములై అభివృద్ధి చెందిన తెలంగాణ సాధించడమే ప్రొఫెసర్ జయశంకర్ ఆకాంక్ష సంపూర్ణ సాకారమవుతుందని అని అన్నారు. ఈ కార్యక్రమములో కార్యదర్శి అవినాష్ రెడ్డి, వార్డు మెంబర్స్ ఓరుగంటి రమాదేవి, యరమాల రోజా, దారా అఖిల, ఆశా వర్కర్లు సుజాత, రమణ, వివోలు ధనలక్ష్మి, భవాని, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



