ఘనంగా కోదాడ కాంగ్రెస్ నాయకులు రావెళ్ల కృష్ణారావు జన్మదిన వేడుకలు…
:శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు….
:మిత్ర మండలి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అభినందనలు శుభాకాంక్షలు …
:అందరి ఆశీస్సులకు,అభిమానానికి ఋణ పడి ఉంటా…. రావెళ్ళ
Mbmtelugunews//కోదాడ, జూన్ 11 : కోదాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రావెళ్ల కృష్ణారావు జన్మదిన వేడుకలు గురువారం కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణారావు మిత్ర మండలి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు, మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబులు రావెళ్ల కృష్ణారావుతో కేక్ కట్ చేయించి పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.

ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగి, సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకైన పాత్ర పోషిస్తూ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల ప్రచారం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో కృషి చేస్తున్న నాయకుడిగా కృష్ణారావు ప్రత్యేక గుర్తింపు పొందారని కొనియాడారు.
గోపిరెడ్డి నగర్ ప్రాంతంలో వినాయక చవితి ఉత్సవాలు, బతుకమ్మ సంబరాలు, సంక్రాంతి పర్వదినం సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు, యువతకు క్రీడా కార్యక్రమాలు, వివిధ సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణ ద్వారా ప్రజల మన్ననలు పొందిన నాయకుడిగా రావెళ్ల కృష్ణారావు ఎదిగారని పలువురు వక్తలు పేర్కొన్నారు. సేవా దృక్పథం, సామాజిక బాధ్యత, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసే నాయకత్వ లక్షణాలు ఆయనను ప్రజలకు మరింత చేరువ చేశాయని అభిప్రాయపడ్డారు.
భగవంతుని అనుగ్రహంతో ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు కలిగి మరెన్నో జన్మదిన వేడుకలను సంతోషంగా జరుపుకోవడంతో పాటు రాజకీయ, సామాజిక రంగాలలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం మిత్రులు, అభిమానులు శాలువాలతో ఘనంగా సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి, కేక్ తినిపిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా రావెళ్ల కృష్ణారావు మాట్లాడుతూ తన జన్మదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై చూపుతున్న ప్రేమ, ఆదరణ, అభిమానాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటానని పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులు, మిత్రుల సహకారం, పార్టీ నాయకత్వ ప్రోత్సాహంతో మరింత సేవాభావంతో ముందుకు సాగుతానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఖాజా, పాశం శ్రీనివాసరావు, కాంగ్రెస్ నాయకులు అత్తూరి ప్రసాద్ ( లైటింగ్), మైలార్శెట్టి భాస్కర్, మట్టపల్లి సాలయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, అభిమానులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



