Friday, June 12, 2026
[t4b-ticker]

కోదాడ ప్రాంత విద్యార్థులకు ఎన్ఆర్ఎస్ విద్యాసంస్థలు అందిస్తున్న సేవలు అభినందనీయం

కోదాడ ప్రాంత విద్యార్థులకు ఎన్ఆర్ఎస్ విద్యాసంస్థలు అందిస్తున్న సేవలు అభినందనీయం

:మున్సిపల్ చైర్ పర్సన్ యెర్నేని కుసుమ బాబు

Mbmtelugunews//కోదాడ, జూన్ 11(ప్రతినిధి మాతంగి సురేష్): కోదాడ పట్టణంతో పాటు పరిసర ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ఎన్ఆర్ఎస్ విద్యాసంస్థలు చేస్తున్న కృషి అభినందనీయమని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ యెర్నేని కుసుమ బాబు అన్నారు. కోదాడ పట్టణంలోని విద్యానగర్ లో ఎన్ఆర్ఎస్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్ఆర్ఎస్ స్కూల్ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకి మెరుగైన విద్య అందించి వారిని బాధ్యత గల పౌరులుగా తీర్చి దిద్దేలా ఎన్ఆర్ఎస్ యాజమాన్యం, ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.

విద్యతో పాటు విద్యార్థులకు నైతిక, మానవతా విలువలు బోధించి విద్యార్థులను ఉన్నత పౌరులుగా తయారు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీ నారాయణ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావులు పాల్గొని మాట్లాడుతూ ఇంటర్మీడియట్ స్థాయిలో విద్యార్థులకు మంచి బోధన అందిస్తూ జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించిన ఎన్ఆర్ఎస్ కాలేజ్, ప్రాధమిక, హై స్కూల్ విద్యలో కూడా అవే ఫలితాలు సాధించాలన్నారు. నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులు అన్నిరంగాలలో రాణించేలా వారికి శిక్షణ ఇవ్వాలని కోరారు. విద్యార్థులకు ఆహ్లాదకర వాతావరణంలో విద్యా బోధన చేసేందుకు సువిశాల క్యాంపస్ తో పాటు క్రీడలలో కూడా ట్రైనింగ్ ఇచ్చేందుకు పాఠశాల యాజమాన్యం ఏర్పాట్లు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ జాస్తి సుబ్బారావు, స్తానిక కౌన్సిలర్ తోట జ్యోతి, కాంగ్రెస్ నాయకులు తోట శ్రీను, కంభంపాటి శ్రీనివాస్, ఎన్ఆర్ఎస్ విద్యా సంస్థల చైర్మన్ వడ్డే రాజేష్ చౌదరి, అడ్వైజరీ చైర్మన్ రవిశంకర్ రెడ్డి, డైరెక్టర్ మనోహర్ రెడ్డి, కరస్పాండెంట్ వేణుగోపాలరావు, ప్రిన్సిపాల్ గంధం వెంకటరమణ, వైస్ ప్రిన్సిపల్ పీఎన్ఆర్, లెక్చరర్లు నటరాజ్, ఉపేందర్, రజనీ కుమార్, పీఆర్వో మల్లికార్జున రావు, పలువురు టీచర్లు, విద్యార్థుల తల్లిదంద్రులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular