స్వేరోస్ కాపుగల్లు గ్రామ కమిటీని ఎన్నిక
Mbmtelugunews//కోదాడ, జూన్ 12(ప్రతినిధి మాతంగి సురేష్): స్వేరోస్ కోదాడ మండల అధ్యక్షులు పాముల రాకేష్ ఆధ్వర్యంలో కాపుగల్లు స్వేరోస్ గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన చెరుకుపల్లి కిరణ్ మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆలోచనలో నుంచి పుట్టిన స్వేరోస్ అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం అనే నినాదంతో అణగారిన వర్గాల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తుందని తెలిపారు. స్వేరోస్ చీఫ్ కన్వీనర్ బల్గూరి దుర్గయ్య ఆదేశానుసారం కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామ గ్రామాన స్వేరోస్ కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందని తెలియజేశారు. ఎన్నికైన నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వేరో సిద్ధాంతాలను పాటిస్తూ నెట్వర్క్ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. కాపుగల్లు గ్రామ కమిటీ అధ్యక్షులుగా జిల్లపల్లి గౌతమ్, ప్రధాన కార్యదర్శిగా జిల్లాపల్లి దివ్య, ట్రెజరరీగా కూచిపూడి వసంత్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా చెరుకుపల్లి చందన, తదితరులు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లపల్లి సుష్మ, జిల్లపల్లి భవ్య, చెరుకుపల్లి సంతోష్, గ్రామస్తులు పాల్గొన్నారు..



