బడి ప్రారంభంలో విద్యార్థుల ప్రవర్తన
:చారుగుండ్ల రాజశేఖర్ వ్యక్తిత్వ వికాస నిపుణులు
Mbmtelugunews//కోదాడ, జూన్ 14(ప్రతినిధి మాతంగి సురేష్): బడి ప్రారంభంలో విద్యార్థులు కొత్త ఉత్సాహంతో, సానుకూల దృక్పథంతో పాటు కొన్ని పద్ధతులు, క్రమశిక్షణను అలవరచుకోవాలి.పాఠశాల ప్రారంభమైనప్పుడు విద్యార్థులు ఆలోచించాల్సిన, ఆచరించాల్సిన ముఖ్యమైన అంశాలు:
*సానుకూల ఆలోచనలు*
:కొత్త ప్రారంభం: ప్రతి విద్యా సంవత్సరాన్ని ఒక కొత్త అవకాశంగా భావించాలి. పాత తరగతుల్లో జరిగిన తప్పులను సరిదిద్దుకుంటూ, కొత్త లక్ష్యాలను ఏర్పరచుకోవాలి.నేర్చుకునే తపన: తరగతిలో ఉపాధ్యాయులు చెప్పే విషయాలను శ్రద్ధగా వినాలి. ప్రతి చిన్న సందేహాన్ని అడిగి తెలుసుకునేందుకు భయపడకూడదు.ఆత్మవిశ్వాసం: నేను చేయగలను అనే నమ్మకాన్ని పెంపొందించుకోవాలి. తోటి విద్యార్థులతో పోటీ పడకుండా, తన ప్రతిభను మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టాలి.
*ఆచరించాల్సిన అంశాలు*
:దినచర్య : బడి ప్రారంభానికి వారం రోజుల ముందు నుంచే ఉదయాన్నే లేవడం, రాత్రి త్వరగా నిద్రపోవడం వంటి అలవాట్లను చేసుకోవాలి.
*క్రమశిక్షణ*
:ఉపాధ్యాయులను, పెద్దలను గౌరవించడం, సమయపాలన పాటించడం, తరగతి గది నియమాలను కచ్చితంగా ఆచరించాలి.
*సహాయకారిగా ఉండటం*
:తోటి విద్యార్థులతో స్నేహపూర్వకంగా మెలగాలి. అవసరమైనప్పుడు స్నేహితులకు సహాయం చేయడం, జట్టుగా పనిచేసే గుణాన్ని అలవర్చుకోవాలి.
*సృజనాత్మకత*
:కేవలం పుస్తక పరిజ్ఞానానికే పరిమితం కాకుండా, సృజనాత్మక ఆలోచనలతో ప్రాజెక్టులు చేయడం, కొత్త విషయాలను అన్వేషించడం చేయాలి.
*ఆరోగ్యకరమైన ఆహారం*
:బ్రేక్‌ఫాస్ట్‌ను ఎప్పుడూ హడావిడిగా చేయకుండా, సమయానికి తాజా పండ్లు, పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. శారీరక, మానసిక ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
*తీసుకోవాల్సిన జాగ్రత్తలు*
:వస్తువుల నిర్వహణ: పెన్సిల్స్, పెన్నులు, నోట్‌బుక్స్, జామెట్రీ బాక్స్ వంటి అన్ని అవసరమైన వస్తువులను ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలి.భావోద్వేగాల నియంత్రణ: కొత్త వాతావరణం, కొత్త ఉపాధ్యాయులు లేదా సబ్జెక్టుల వల్ల మొదట్లో కొద్దిగా ఆందోళన కలగడం సహజం. అలాంటి సమయంలో ఒత్తిడికి గురికాకుండా, తల్లిదండ్రులతో లేదా ఉపాధ్యాయులతో మనసులోని భావాలను పంచుకోవాలి.విద్యార్థులు ఆటలు పాటలు పనులకి ఇష్టపడతారు
*చారుగుండ్ల రాజశేఖర్ వ్యక్తిత్వ వికాస నిపుణులు*
:ఒకేచోట కూర్చోవటం, పాఠాలు వినటం, కదలకుండా ఉండటము పిల్లలకి పాఠశాల చేరగానే నచ్చవు కావున వారికి సహా పాఠ్య అంశాలు, ఆటలు పాటలు నేర్పాలి క్రమంగా పాఠశాల వా తావ రణం అలవాటు చేసుకోని అనుగుణ్యత చెందుతాడు.వేసవిలో ఉత్సాహంగా తిరిగిన పిల్లవాడు వెంటనే వాతావరనం నచ్చదు. స్వేచ్ఛ ఇస్తూ. .ఆసక్తి అనుగుణ్యంగా నేర్చుకునే వాతావరణం పెంచాలి దీనికి ఉపాద్యాయులు తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి.



