శ్రమశక్తి అవార్డు అందుకున్న నాదెళ్ల బాలకృష్ణకి పౌర సన్మానం
Mbmtelugunews//కోదాడ, జూన్ 18(ప్రతినిధి మాతంగి సురేష్) : కోదాడ రూరల్ సీనియర్ లైన్ ఇన్‌స్పెక్టర్, సత్యమేవ జయతే సేవా సమితి వ్యవస్థాపకులు నాదెళ్ల బాలకృష్ణ ప్రతిష్టాత్మక ‘శ్రమశక్తి’ అవార్డును అందుకున్న సందర్భంగా మండల పరిధిలోని రెడ్లకుంట గ్రామంలో గ్రామ ప్రజల ఆధ్వర్యంలో పౌర సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం గ్రామ ప్రజలు శాలువా బొకేతో బాలకృష్ణను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో ఆయన విద్యుత్ శాఖలో ప ప్రజలకు అందిస్తున్న సేవలకు, అనేక సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం, కార్మిక శాఖ మంత్రి వినోద్ చేతుల మీదుగా ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని మే 1 తారీఖున ఈ అవార్డును ప్రదానం చేసిందని అన్నారు. ఈ సందర్భంగా రెడ్లకుంట గ్రామ పంచాయతీ కార్యాలయంలో నాదెళ్ల బాలకృష్ణని ఘనంగా సన్మానించామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి పొలంపల్లి కుటుంబరావు, వైస్ సర్పంచి మల్లెల ప్రసాద్ రావు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంగవరపు లక్ష్మణరావు, విద్యుత్ శాఖ సిబ్బంది తిరుపతిరావు, శ్రీనివాసరావు, గ్రామ పెద్దలు రామారావు, అంబరీష్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.



