నేడు కత్రం యంగ్ ఇండియా స్కాలర్ షిప్ ల పంపిణీ
Mbmtelugunews//కోదాడ, జూన్ 20(ప్రతినిధి మాతంగి సురేష్): నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదో తరగతి విద్యార్థుల కోసం కత్రం చారిటబుల్ ఫౌండేషన్ వారు ప్రకటించించిన కత్రం యంగ్ ఇండియా మెరిట్ స్కాలర్ షిప్ ల పంపిణీ కార్యక్రమం జూన్ 21 ఆదివారం రోజు కోదాడలోని పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు కత్రం చారిటబుల్ ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. ఆదివారం ఉదయం 10:౩౦ గంటలకు కోదాడ పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారనీ, అలాగే కత్రం చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కత్రం శ్రీకాంత్ రెడ్డి కూడా హాజరవుతున్నారనీ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పదో తరగతి 2026 వార్షిక పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మొత్తం 39 మంది విద్యార్థులకు రూ.4 లక్షల 20 వేల రూపాయల స్కాలర్ షిప్ అందించనున్నారు..అందులో భాగంగా మండల స్థాయి ర్యాంకర్లకు (37మంది) ఒక్కొక్కరికి రూ.10వేలు, నియోజకవర్గస్థాయి ర్యాంకర్లకు(ఇద్దరు) రూ.25వేల స్కాలర్ షిప్ అందించనున్నట్లు కత్రం చారిటబుల్ ఫౌండేషన్ ప్రతినిధులు కత్రం కిరణ్ రెడ్డి, ముత్తవరపు రామారావు, ముడియాల సత్యనారాయణ రెడ్డి, బుడిగ రామాంజనేయులు తెలిపారు.



