Saturday, June 20, 2026
[t4b-ticker]

కోదాడ నియోజకవర్గ పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఘనంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు

కోదాడ నియోజకవర్గ పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఘనంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు

Mbmtelugunews//కోదాడ, జూన్ 20(ప్రతినిధి మాతంగి సురేష్) : రెవరెండ్ పాస్టర్ కే శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక గుడిబండ రోడ్ లో గల బేతేలు గాస్పెల్ చర్చి నందు తెలంగాణ రాష్ట్రభారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిషప్ ఏ జే సామ్యేలు పాల్గొని పాస్టర్లు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి కేక్ కట్ చేసి మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రెవరెండ్ పాస్టర్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో క్రైస్తవుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి వేలకోట్ల రూపాయలు నిధులు తీసుకువచ్చి కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్న తమ అభిమాన నాయకుడు ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరెన్నో ఉన్నతమైన పదవులు అందుకొని ప్రజలకు సేవలు అందించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని ప్రభువైన యేసుక్రీస్తు పేరట ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పాస్టర్ల దీవెనలు అందజేశారు. పాస్టర్ పి సైమన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కోదాడ నియోజకవర్గ అధ్యక్షులు బ్రదర్ రామారావు, సెక్రెటరీ కొర్నేలు, కోదాడ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్, ఫోర్ కమిటీ వర్కింగ్ చైర్మన్ పాస్టర్ వి శ్రీనివాస్ గౌడ్, చీప్ కోఆర్డినేటర్ పాస్టర్ రూపస్ నాయక్, యూత్ నియోజకవర్గ ప్రెసిడెంట్ పాస్టర్ సురేష్, ట్రెజరీ పాస్టర్ పాల్ చారి వివిధ మండలాల అధ్యక్షులు కోదాడ పాస్టర్ ఏసుబాబు, నడిగూడెం పాస్టర్ గాబ్రియేలు, చిలుకూరు పాస్టర్ అబ్రహాము, కోదాడ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ జోపఫ్ రాజు, సెక్రెటరీ పాస్టర్ అమేస్, స్టెఫెన్ సంతోష్ పాల్ కిషోర్, ఏనోస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular