కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు…
:ఆటో డ్రైవర్లుకు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం…
:10వ వార్డు కౌన్సిలర్ మామిడి రామారావు..
Mbmtelugunews//కోదాడ, జులై 23(ప్రతినిధి మాతంగి సురేష్): పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కోదాడ పట్టణంలోని 10వ వార్డు కౌన్సిలర్ మామిడి రామారావు కేక్ కట్ చేసి కేటీఆర్‌కు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రతి సంవత్సరం వినూత్న రీతిలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది అని అన్నారు. ఇందులో భాగంగానే గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా 10వ వార్డులో మామిడి రామారావు ఆధ్వర్యంలో 25 మంది ఆటో కార్మికులకు 10లక్షల రూపాయలు ప్రమాద బీమా పత్రాలను అందజేశారు. రోజూ కష్టపడి జీవనం సాగించే ఆటో డ్రైవర్ల కుటుంబాలకు అండగా నిలుస్తున్న ఈ వినూత్న కార్యక్రమంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచి అనంత్తుల సైదయ్య, కౌన్సిలర్ చంద్రశేఖర్, బత్తుల కృష్ణ, వీరబాబు, మాజీ కౌన్సిలర్ లలిత, చందు, వెంకటి, వెంకన్న, సీత్తయ్య, సిలార్, అఖిల్, మున్నా, లింగ, ఆటో యూనియన్ నాయకులు బోధల్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.



