Wednesday, July 29, 2026
[t4b-ticker]

రైతులు ఆరు తడీ పంటలు వేయాలి

రైతులు ఆరు తడీ పంటలు వేయాలి

:ప్రతి ఇంట్లో ఇంకుడు గుంట తప్పనిసరిగా ఉండాలి.

:కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్

Mbmtelugunews//కోదాడ, జూలై 28(ప్రతినిధి మాతంగి సురేష్): ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు ఆరుతడి పంటల వైపు వెళ్లాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కోరారు. మంగళవారం మండల పరిధిలోని అల్వాలపురం రైతు వేదిక లో ఎల్ నీనో ప్రభావం పై కలెక్టర్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ కొంతమంది రైతులు ఇదివరకే పత్తి, కంది, పెసర, బొబర్ల వంటి పంటలు సాగు చేయడం జరిగిందని, అలాంటి పంటల్లో అంతర పంటలు వేసుకోవాలని, తద్వారా పంటల సాగు ఖర్చు తగ్గుతుందని కలెక్టర్ తెలిపారు. అల్పపీడనద్రోణి వల్ల సెప్టెంబర్ మాసంలో కూడ వర్షాలు వచ్చే అవకాశం లేదని, అంతేకాక ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర లలో కూడా వర్షాలు లేనందున, ప్రాజెక్టులు కూడా నిండే పరిస్థితి లేదని, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని వాస్తవ పరిస్థితులను గమనించి ఆరు తడి పంటలు వేసుకోవాలని చెప్పారు. ఇదివరకే పత్తి, కంది, పెసర, బొబర పంటలు వేసుకున్న వారు అంతర పంటలు వేసుకోవచ్చని సూచించారు. వీటితోపాటు, ఉద్యాన పంటలు, కూరగాయల సాగు చేయవచ్చని, ప్రభుత్వం సబ్సిడీపై బిందు పరికరాలను అందజేస్తుందని తెలిపారు. రైతులు ఆరుతడి పంటల కింద సబ్జ, కొర్రలు, సామలు వంటి పంటలను సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మార్కెటింగ్ సదుపాయాలు కల్పించే ఏర్పాటు చేస్తుందని తెలిపారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా బోర్లు ,ఎత్తిపోతల పథకాల కింద, అలాగే సాధారణ వ్యవసాయం ఎలా చేయాలో కూడా వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు తెలియజేస్తారని చెప్పారు.అంతేకాక ఆయిల్ ఫామ్ వల్ల స్థిరమైన ఆదాయం వస్తుందని, ఆయిల్ పామ్ తోటలు సాగుకు పురుగుల బెడద, ఎల్ నీనో, కోతుల బెడద వంటివి
ఉండవని అన్నారు. రైతు నేస్తం ద్వారా అందించే వ్యవసాయ యాంత్రీకరణ, పద్ధతులు తెలుసుకుంటూ వ్యవసాయం సాగు చేస్తే త్వరగా వ్యవసాయం ముందుకు వెళుతుందని, రైతులు కష్టాల భారం నుండి తప్పించుకోవచ్చని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మున్సిపల్ చైర్ పర్సన్ కుసుమ బాబు, ఆర్డిఓ సూర్య నారాయణ, తహసిల్దార్ సంతోష్ కిరణ్, ఎంపీడీవో ఇస్సాకు హుస్సేన్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ మల్లేశ్వరి, ఎంపీ ఓ రాంబాబు, ఏవో రజిని, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు అలసకాని శరబందేశ్వరరావు, కోదాడ మండలం సర్పంచులు పాలకి సురేష్, కొత్త గురవయ్య, అలసకాని భవాని, మందుల నాగయ్య, ధారావత్ బాబ్జి, హాజీ నాయక్, సత్యనారాయణ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular