Sunday, August 2, 2026
[t4b-ticker]

రైతులు ఆరితడి పంటలపై దృష్టి సారించాలి

రైతులు ఆరితడి పంటలపై దృష్టి సారించాలి

:అగ్రికల్చర్ ఏవో రజిని

Mbmtelugunews//కోదాడ, ఆగష్టు 01(ప్రతినిధి మాతంగి సురేష్ ):ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని మండల అగ్రికల్చర్ అధికారిని రజిని అన్నారు. మండల పరిధిలోని గుడిబండ గ్రామ పంచాయతీలో రైతులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వ్యవసాయ అధికారి (ఏవో) రజని, సర్పంచి మందుల నాగయ్యలు పాల్గొని మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావం కారణంగా వరి సాగు చేస్తే రైతులు నష్టపోయే అవకాశం ఉందని, అందువల్ల నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని కంది, పెసర, మినుము వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. అనంతరం వ్యవసాయ అధికారి రజని, గ్రామ సర్పంచి మందుల నాగయ్య చేతుల మీదుగా రైతులకు కంది విత్తనాలను పంపిణీ చేశారు. అలాగే ఆరుతడి పంటల సాగు విధానాలు, పంటల ఎంపిక, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు విలువైన సూచనలు అందించారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ పిచ్చయ్య, రైతులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular