బొల్లం మల్లయ్య అసత్య ప్రచారాలు మానుకోవాలి.
:మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి లను విమర్శిస్తే సహించేది లేదు:
:చైర్పర్సన్ తిరుపతమ్మ సుధీర్.
:మల్లయ్య యాదవ్ మాటల నమ్మే స్థితిలో ప్రజలు లేరు.
:కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మొక్కా బిక్షపతి.
Mbmtelugunews//నడిగూడెం, ఆగష్టు 03(ప్రతినిధి మాతంగి సురేష్): మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కరివిరాల మోడల్ స్కూల్లో మధ్యాహ్న భోజనం పై చేసిన అసత్యపు ఆరోపణలు మానుకోవాలని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ అన్నారు. సోమవారం నడిగూడెం మండలంలోని కరివిరాల ఆదర్శ పాఠశాలలో కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు మొక్క బిక్షపతి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలసి పాఠశాలను విజిట్ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనమును, హాస్టల్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. పిల్లలతో కలిసి భోజనం చేశారు. మధ్యాహ్న భోజన నిర్వహణపై సంతృప్తి వ్యక్తపరిచారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం హాస్టల్ విద్యార్థులకు, మధ్యాహ్న భోజనం నిర్వహణకు మెస్ చార్జీలు పెంచి, మెనూ ప్రకారం చక్కటి నాణ్యమైన భోజనం అందిస్తుంటే మాజీ ఎమ్మెల్యే మధ్యాహ్న భోజనం పై అబద్ధపు ప్రచారం చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు. తన ఉనికిని కాపాడుకోవడం కోసం పాఠశాలలో రాజకీయాలు చేయటం తగదన్నారు. కోదాడను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న మంత్రి ఉత్తమ్ దంపతులపై,కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పై లేనిపోని ఆరోపణ చేస్తే తగిన బుద్ధి చెబుతామన్నారు. కరివిరాలకు మోడల్ స్కూల్ మంజూరు చేపించిన ఘనత కూడా ఉత్తమ్ దంపతులకే దక్కుతుందన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు మొక్కా బిక్షపతి మాట్లాడుతూ బొల్లం మల్లయ్య యాదవ్ తన సొంత గ్రామంలో ఉన్న మోడల్ స్కూల్ కు ఆయన చేసింది ఏమీ లేదని, కనీసం సొంత గ్రామానికి ఆర్టీసీ బస్సు కూడా మంజూరు చేయలేదని విమర్శించారు.
పది సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అత్యధిక నిధులు కేటాయిస్తూ విద్యకు పెద్దపీట వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గుర్రం నీలిమా గాంధీ, సర్పంచులు దున్నా శ్రీనివాస్, వేల్పుల సోమయ్య, అట్టూరి పుష్ప నాగేదర్ రెడ్డి, నాయకులు గుండు శ్రీను, పందిరి వెంకటరెడ్డి, బడేటి వెంకటేశ్వర్లు, దేవబత్తిని రమేష్, కాసాని శివ, బాణాల నాగరాజు, పాతకోట్ల నాగేశ్వరరావు, సుబ్బారావు, స్వామి, భారీ వెంకన్న, పల్లపు గోపాల్, శ్రీనివాస్ రెడ్డి, విజయ్, రామయ్య, హుస్సేన్, జానీ, రమేష్, మహేష్, మల్లయ్య తదితరులు ఉన్నారు.



