తల్లిపాలు నవజాత శిశువుకు అత్యంత సంపూర్ణమైన మొదటి ఆహారం
:సర్పంచి మందుల నాగయ్య
Mbmtelugunews//కోదాడ, ఆగష్టు 06(ప్రతినిధి మాతంగి సురేష్): తల్లిపాలు నవజాత శిశువుకు అత్యంత సంపూర్ణమైన మొదటి ఆహారం అని సర్పంచి మందుల నాగయ్య అన్నారు. మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రాలు 1, 2, 3, 4లలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచి మందుల నాగయ్య సిడిపిఓ కిరణ్మయి లు పాల్గొని తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు అనంతరం సర్పంచి నాగయ్య మాట్లాడుతూ ముర్రుపాలు బిడ్డకు ఎంతో మేలని మర్రిపాలు పుట్టిన పాపకు అందించడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా సీడీపీఓ కిరణ్మయి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుండి 7వ తేదీ వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తారని తెలిపారు. శిశువు జన్మించిన మొదటి గంటలోనే తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వాలని, తల్లిపాలే శిశువుకు సంపూర్ణ ఆహారమని, ఇతర పానీయాలు ఇవ్వకూడదని సూచించారు. అలాగే, ఆరు నెలలు పూర్తయిన చిన్నారులకు సీబీఈ కార్యక్రమంలో భాగంగా అన్నప్రాశన కార్యక్రమం నిర్వహించారు. చిన్నారులకు అక్షరాభ్యాసం, పుట్టినరోజు వేడుకలను కూడా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు వీణ, సూర్యకళ, పూజా, అంగన్‌వాడీ టీచర్లు ఎస్‌కే నసీమ, పులి జానమ్మ, పులి నాగమణి, కాలితిరుపి హేమలత, గర్భిణీలు, బాలింతలు, తల్లులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.



